Director Om Raut Mistakes in Adipurush: రామాయణం ఒక సుందరమైన కావ్యం. ఇది కేవలం ఒక కథ కాదు సమాజానికి ఆదర్శంగా నిలిచిన అంతటి అద్భుతమైన కథను తమకు నచ్చినట్లుగా రాసుకోవడమే కాకుండా అందులోని సన్నివేశాలను కూడా మార్చడం సబబు కాదు అని ఆదిపురుష్ సినిమా చూసిన ప్రేక్షకులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ అని హంగులు చేకూర్చి సినిమా రిలీజ్ చేస్తే సరిపోదు…బడ్జెట్ మీద పెట్టిన శ్రద్ధలో కాస్త అయినా కథ మీద పెడితే బాగుంటుంది.
Director Om Raut Mistakes in Adipurush: మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఆదిపురుష్ చిత్రంలో ఎన్నో లోపాలు బయటకు వస్తున్నాయి. హనుమంతుడు లంకను చేరి రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని కలిసినప్పుడు రాముడికి ఆనవాలుగా ఆమె చూడామణిని హనుమంతుడికి అందిస్తుంది. చూడామణి అనేది ఒక శిరో ఆభరణం. రామాయణం ప్రకారం దశరధుడు కౌసల్యకు ఇచ్చిన చూడామణిని ఆమె తన కోడలైన సీతాదేవికి ఇస్తుంది.
తనను కలిసాను అని హనుమంతుడు శ్రీరాముడికి చెప్పడానికి ఆనవాలుగా ఆమెకు ఎంతో ఇష్టమైన ఆ చూడామణి ను (chudamani) సీతాదేవి హనుమంతుడికి అందిస్తుంది. ఆ చూడామణి చూసిన శ్రీరాముడు సీతను చూసినట్లుగా పరవశించిపోతాడు అని రామాయణంలో ఎంతో సుందరంగా రచించారు. రామాయణానికి ముఖ్యమైన ఘట్టాలలో ఈ చూడామణి ఘట్టం ఒకటి…దాన్ని కూడా మోడ్రన్ గా మార్చేసి ఆంజనేయస్వామికి సీతాదేవి గాజులు ఇచ్చినట్లుగా ఆది పురుష్ లో చూపించారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా చూసిన వారు అసలు ఈ సన్నివేశం రామాయణంలో ఎక్కడ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క సన్నివేశమే కాదు పలు సన్నివేశాలను రామాయణంతో సంబంధం లేకుండా మార్చడంపై కొందరు తమ అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఆఖరికి రావణాసురుడి లంక కూడా జాగ్రత్తగా గమనిస్తే తోర్ మూవీలో అస్గర్డ్ కి నలుపు రంగు పూసినట్లుగా ఉంది. ఇందులో కనిపించే భూతాలు, దెయ్యాలు హరీ పోటర్ మూవీస్ లో కనిపించే గోష్ట్ లా ఉన్నాయి…ఇలా చెప్పుకుంటూ పోతే…ఈ మూవీపై కామెంట్స్ కి రెండు మూడు సీరీస్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు.