Adipurush story and dialogues changed: భారీ అంచనాల మధ్య రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఇంతకుముందు ఎన్నడూ కానీ విని ఎరుగని విజువల్ వండర్ గా టాలీవుడ్ లో మరియు బాలీవుడ్ లో అభివర్ణించిన ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి విపరీతమైన ట్రోలింగ్ కి గురి అవుతుంది. రామాయణాన్ని యధాతధంగా తీయకుండా అందులో అనవసరమైన మార్పులు ,కూర్పులు చేసి పలు సందర్భాలను మరియు సన్నివేశాలను మార్చడంపై కొందరు తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
Adipurush story and dialogues changed: విడుదలైన రోజు నుంచి ఘోరంగా ట్రోలింగ్ కు గురి అవుతున్న ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ పై విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ముఖ్యంగా ఆంజనేయ స్వామి చేత మాస్ డైలాగ్స్ చెప్పించడం చాలా అభ్యంతరకరంగా ఉంది అని కొందరు పేర్కొన్నారు. నాతో ఒక చుట్టిన గుడ్డ నీ బాబుది…దానికి వేసిన సమరు నీ బాబుది …అంటించిన అగ్ని నీ బాబుది …కాలేది కూడా నీ బాబుకే …అని ఆంజనేయస్వామి వదిలిన మాస్ డైలాగ్ తో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయి ఏమనాలో కూడా అర్థం కాలేదు.
అయితే వెల్లువొత్తుతున్న నెగిటివ్ ట్రోల్స్ దాడికి మూవీ మేకర్స్ దిగివచ్చారు అని చెప్పవచ్చు. అందుకే ఆది పురుషులోని కొన్ని డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించారు కూడా.”ఒక విజువల్ వండర్ గా గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడం కోసం సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను మార్చడానికి మా చిత్ర టీం నిర్ణయించుకుంది. ప్రేక్షకులు మరియు ప్రజలు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ను ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం”అని ఆది పురుష్ చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఈ చిత్రంలో లంకా దహనం సమయంలో హనుమంతుడు చెప్పిన డైలాగ్స్ ఏ కాకుండా రావణుడితో సీతమ్మవారు మాట్లాడిన మాటలకు కూడా కాస్త అభ్యంతరకరంగానే ఉన్నాయి. అలాగే రావణాసురుడు మాట్లాడిన మాటలు కొన్ని సందర్భాలలో పొంతన లేకుండా ఉన్నాయి. అందుకే కొన్ని డైలాగ్స్ లో మార్పులు చేసి మూడు నాలుగు రోజుల్లో థియేటర్లలో అప్డేట్ చేసే విధంగా చిత్ర యూనిట్ సన్నాహాలు మొదలుపెట్టింది.

ఈ మూవీ లో ఇప్పటికే లిప్సింక్ డైలాగ్స్ కి లోపించింది. ప్రభాస్ సైఫ్, అలీ ఖాన్ మరియు సన్నీసింగ్ చెప్పిన పలు డైలాగ్స్ లో అస్సలు లిప్సింక్ లేదు. ఇక ఇప్పుడు చెప్పిన మార్పులన్నీ కూడా చేస్తే సినిమాలో డైలాగ్ డెలివరీ కి పొంతన లేకుండా మారుతుందేమో…టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఎంత పెద్ద చిత్రం అయినా డిజాస్టర్ అనడానికి ఆది పురుష మరో ఎగ్జాంపుల్ కాదు కదా..?