Adipurush OTT Release Date: ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ చేసిన విషయం తెలిసిందే. సినిమాపై మొదటి దగ్గర నుంచే భారీ అంచనాలు ఉండగా ఆదిపురుష్ టీజర్ విడుదల చేయడంతో విఎఫ్ఎక్స్ బాలేదు అంటూ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తరువాత సినిమా బడ్జెట్ పెంచి బిఎఫ్ ని సరి చేయడం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
Adipurush OTT Release Date: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత మరిన్ని విమర్శలు వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో మరినీ కలెక్షన్ సంపాదించింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ఆదిపురుష్ (Adipurush) సినిమా ఓటీటీలోకి (OTT) ముందుగానే విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ (Amazon Prime) సంస్థ ప్రభాస్ ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ (Digital Rights) ని సొంతం చేసుకుంది
ఈ సినిమాని జులై చివరి వారంలోనూ లేదంటే మే మొదటి వారంలో ఓటీటీలోకి (OTT) విడుదల చేయడానికి సిద్ధం చేశారు మేకర్స్. అయితే రోజులు గడిచే కొద్దీ సినిమా కలెక్షన్స్ తగ్గిపోవడంతో ఆదిపురుష్ సినిమాని ఇప్పుడు జులై రెండో వారంలో ముందుగానే ఓటీటీలోకి విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా ధియేటర్లో ఉండగానే తమిళ్ వర్షన్ కి సంబంధించిన పైరసీ సీడీలు ఇప్పుడు అంతటా హల్చల్ చేస్తున్నాయి. అందుకనే ఆదిపురుష్ (Adipurush) సినిమాని జులై రెండో వారంలో ఓటీటీలోకి (OTT) విడుదల చేయుటకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. త్వరలోనే ఈ వార్త పై క్లారిటీ రానుంది.