Adipurush Pre Release Event Date and Place: పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ తర్వాత ఓం రౌత్ దర్శకత్వం వహించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాని జూన్ 16న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలరు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Adipurush Pre Release Event Date and Place: ఇక విషయంలోకి వెళ్తే, ప్రభాస్, కృతి సనం, సైఫ్ అలీ ఖాన్ భారీ క్యాస్టింగ్ తో తరికెక్కుతున్న సినిమా ఆదిపురుష్. ఓంరౌత్ దర్శకత్వంలో తర్కెక్కిన ఆది పుష్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ వస్తున్నా ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్తో నిర్మించారు మేకర్స్. టీజర్ అలాగే పోస్టర్ తో మంచి హైపు క్రియేట్ చేశారు. ప్రమోషన్ లో భాగంగా ఆదిపురుష్ ట్రైలర్ ని (Adipurush Trailer) మే 9న తిరుపతిలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అలాగే ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (Adipurush Pre release Event) డేటు అలాగే ప్లేస్ ని కూడా ఫైనల్ చేస్తున్నట్టు చెబుతున్నారు. జూన్ 3న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఈవెంట్ ని తిరుపతిలోని SV గ్రౌండ్స్ ప్లేస్ ని సిద్ధం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అలాగే మేకర్స్ భద్రాచలంలో కూడా ఒక ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారంట. మరికొన్ని రోజులు పోతే గాని వీటి మీద క్లారిటీ అనేది రాదు.
సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. T-Series మరియు Retrophiles Pvt Ltd సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి, జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించబడింది. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు భారయతీ భాషలన్నింటిలో రిలీజ్ చేయబోతున్నారు.