Homeసినిమా వార్తలువెంకటేశ్వర స్వామి సాక్షిగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోన్నున ఆదిపురుష్..!!

వెంకటేశ్వర స్వామి సాక్షిగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోన్నున ఆదిపురుష్..!!

Adipurush Pre Release Event Details: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మైథాలజికల్ మూవీ ఆదిపురుష్. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణం యొక్క కథను ఆధారంగా నిర్మించబడుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా సిల్వర స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ఎంతో భారీ హైప్ క్రియేట్ అయి ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ఒక ట్రైలర్ను మే 9 వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.

Prabhas Adipurush Pre Release Event Details: ట్రైలర్ అంటే ఏదో చిన్న తరహా రిలీజ్ కాదు ఏకంగా ఒక్కసారి 75 దేశాలలో అటు డిజిటల్ మరియు ఇటు బిగ్ స్క్రీన్ పై ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ఈ మూవీని టి సిరీస్ భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఏ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అత్యంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఆధ్యాత్మికత చిత్రం కావడంతో…డివోషనల్ టచ్ ఇవ్వడానికి అన్నట్లుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఆది పురుష యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఏడుకొండల వాడి సాక్షిగా ఆది పురుష ఫ్రీ రిలీజ్ జోరు మొదలవుతుంది. ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ఇదే క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జూన్ 3 వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం. మే 9 తర్వాత ఆది పురుష మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ తప్ప మిగిలిన నటులు అందరూ ప్రమోషన్ లో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. ఈ మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ డేట్స్ 500 కోట్ల వరకు జరిగే అవకాశం ఉందని అంచనా.

Adipurush Pre Release Event Date, place and chief guest details

ఈ మూవీ రిలీజ్ అయిన వెంటనే ప్రశాంత్ ని ప్రభాస్ కాంబోలో వస్తున్న సాలార్ చిత్రం నుంచి కూడా టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిపురిష్ మూవీ తర్వాత మారుతీ తో ప్రభాస్ చేస్తున్న సినిమా గురించి కూడా మంచి అప్డేట్ విడుదల చేస్తున్నారట. కుదిరితే దీంతోపాటే ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కె నుంచి ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. ఇంకేముంది డార్లింగ్ ఫాన్స్ కు ఈ న్యూస్ మంచి కిక్ ని ఇవ్వక మానదు..

- Advertisement -

Web Title: Adipurush Pre Release Event Date, place and chief guest details, Prabhas, Kriti Sanon next Adipurush promotions images, Prabhas Adipurush Interview, Adipurush Event Details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY