Adipurush final box office collection: బిగ్ బడ్జెట్ తో నిర్మించిన ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుందని చాలామంది ఆశించారు. ప్రభాస్ రాముడు పాత్రలో నటించిన ఈ సినిమా మొదటి టీజర్ దగ్గరికి నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బీజర్ విడుదలైన తర్వాత గ్రాఫిక్స్ పరంగా బాలేదంటూ చాలా రోజు జరిగాయి. ఆ తర్వాత మేకర్స్ మరింత బడ్జెట్ పెంచి గ్రాఫిక్స్ ని సరి చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది.
Adipurush lost huge amount at box office: జూన్లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద మెుదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా చూస్తే మొదటివారం తప్పించి మిగతా రోజుల్లో అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది సినిమా. సినిమా విడుదల అయ్యి మూడు వారాలకు అయినప్పటికీ రోజురోజుకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తగ్గటమే కానీ ఎక్కడా పెరిగినట్టు సూచనలు లేవు. అందుతున్న సమాచారం మేరకు ఇంకో వారంలో దాదాపుగా క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ఇప్పటివరకు ఎటువంటి కలెక్షన్స్ చేసింది అలాగే ఎన్ని నష్టాలు తీసుకువచ్చిన ప్రొడక్ట్స్ గురించి ఆరా తీస్తే. ట్రేడ్ వర్గాల నుండి అన్నతున్న సమాచారం మేరకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 82 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకుంది. ఇక మిగతా రాష్ట్రాల గురించి చూస్తే కర్ణాటకలో 12 కోట్లు తమిళనాడులో 2.40 కోట్లు కేరళలో 87 లక్షలు ఎలక్షన్స్ ని మాత్రమే సినిమా రాబట్టగలిగింది.

అలాగే హిందీలోనూ మిగిలిన ప్రాంతాల్లో చూస్తే టోటల్ గా 70 కోట్ల షేర్ ని అలాగే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రపంచం మొత్తం మీదగా చూసుకుంటే ఆదిపురుష్ సినిమా 193 కోట్ల షేర్ 390 రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది. ఆదిపురుష్ టోటల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 240 కోట్లు చేయక సినిమా కలెక్షన్స్ ప్రకారం 47 నుంచి 49 కోట్ల షేర్ ని ఇంకా రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మిగిలిన అమౌంట్ ప్రొడ్యూసర్స్ కి నష్టాల కింద అంచనా వేసుకుంటారు.