Adipurush Review in Telugu: బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ వరల్డ్ రేంజ్ మైథాలజికల్ మూవీ ఆది పురుష్. మొదటినుంచి ఎన్నో వివాదాల మధ్య నడిచిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో ఈ రోజు తెలుసుకుందాం.
Adipurush Review & Rating: 3/5 – నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ – దర్శకుడు : ఓం రౌత్ – నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్
Adipurush Review in Telugu: కథ: రాఘవుడు మరియు అతని సతీమణి జానకి లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఉండే సమయంలో రాముడి కోసం వచ్చిన శూర్పణఖ కు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపుతాడు. ఆమె చెప్పిన మాటలు నమ్మి జానకిపై ఆశ పెంచుకున్న రావణుడు సాధువు వేషంలో వచ్చి ఆమెను అపహరిస్తాడు.
కనిపించకుండా పోయిన జానకిని వెతుకుతూ రాఘవుడు వానరసైన్యాన్ని కలుస్తాడు. ఇక ఆయన జానకిని ఎలా దక్కించుకున్నాడు? సీతారాముల కలయికలో హనుమంతుడు ఎటువంటి పాత్ర పోషించాడు? రామ రావణ సంగ్రామం ఎలా జరిగింది? తెలియాలి అంటే మిగిలిన కథ చూడాలి.
విశ్లేషణ: ఈ చిత్రం మైథాలజికల్ స్టోరీ రామాయణం బేసిస్ మీద తీశారు కాబట్టి కథలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. అనాదిగా ప్రతి ఇంట్లో చిన్నప్పటి నుంచి తెలుసుకున్న కథ రామాయణం అయితే దీన్ని దృశ్య రూపంలో చూపించినప్పుడు ఎలా చూపిస్తారు అనే విషయంలో మాత్రమే కొత్తదనం ఉంటుంది. ఆపరంగా తీసుకుంటే ఆది పురుష్ ఒక మోడ్రన్ రామాయణం అని చెప్పవచ్చు.
రామాయణంలో జరిగినటువంటి ప్రధాన ఘట్టాలను త్రీడి రూపంలో ఆవిష్కరించి నేటితరం పిల్లలకు రామాయణం సులభంగా అర్థమయ్యే విధంగా ఈ చిత్రం ఉంది. ఇది ఒక విజువల్ వండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.గత కొద్ది కాలంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భారతీయులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు ఎంతో గ్రాండ్గా 7000 థియేటర్లలో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం మీద 1600 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తో పలుచోట్ల ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి.
కలెక్షన్స్ పరంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఎందుకంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం కాస్త సహజత్వం లేకుండా మరీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రభాస్ రాముడిగా బాగున్నాడా బాగలేడా అన్న విషయం తీసి పక్కన పెడితే నిజానికి రాముడి క్యారెక్టర్ లో ఉండాల్సిన మృదుత్వం ప్రభాస్ లో కనిపించడం లేదనే చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :
*రామాయణం ప్రధాన ఘట్టం కావడంతో ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.
*యుద్ధ నేపథ్యంలో సాగిన త్రీడీ సన్నివేశాలు అధ్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి.
*ఈ చిత్రంలో అందరి నటన తమ పాత్రలకు తగినట్లుగా మెప్పించే విధంగా ఉంది.
*భారీ విజువల్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ని అందిస్తోంది.
*ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రభాస్ మరియు కృతి సనన్ యాక్షన్ హైలెట్ అని చెప్పవచ్చు.
*రావణబ్రహ్మగా సైఫ్ అలీ ఖాన్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.
*కొన్ని యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగించే విధంగా ఉన్నాయి.
మైనస్ పాయింట్స్ :
*హిందీ పరంగా ఈ చిత్రం సెట్ అవుతుందేమో కానీ తెలుగు నేటివిటీకి ఈ మూవీలో క్యారెక్టర్స్ వేషధారణ కాస్త డిఫరెంట్ గా ఉంది అని చెప్పవచ్చు.
*ముఖ్యంగా రావణాసురుడి వేషధారణ కాస్త ఇబ్బందికరంగానే ఉంది.
*త్రీడీ విజువల్స్ మీద పెట్టినంత శ్రద్ధ సినిమాలోని సన్నివేశాలు మరియు పాత్రల మీద పెట్టలేదు అనిపిస్తుంది.
*ముఖ్యంగా ఘోస్ట్ అటాకింగ్ సీన్ అయితే హ్యారీపోటర్ గోస్ట్లను తలపిస్తోంది.
*సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతక ఉండడంతో కాస్త ఇంట్రెస్ట్ మిస్ అయింది.
సాంకేతిక విభాగం : ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక విభాగం అద్భుతంగా పనిచేసింది అని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని పతాక స్థాయి సన్నివేశాలు ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకువెళ్లాయని చెప్పవచ్చు. సినిమా ఎడిటింగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని అద్భుతంగా సెట్ అయ్యాయి. ఈ మూవీకి సంబంధించిన అంతవరకు నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
తీర్పు : రామాయణం ఒక అద్భుతమైన కావ్యం అలాంటి సినిమాని దృశ్యరూపంగా తీయడం అంటే అంత సులువైన విషయం కాదు. కథ ,కథనం, యాక్టర్స్ అన్ని బాగున్నప్పటికీ చిత్రంలో జీవకల ఉట్టి పడాలి. విజువల్ వండర్ మరియు త్రీడీ ఎఫెక్ట్స్ బాగున్నప్పటికీ ‘ఆదిపురుష్’ లో మైథాలజికల్ ఫీలింగ్ మాత్రం అంత గొప్పగా లేదు అని చెప్పవచ్చు. ప్రభాస్ ఫాన్స్ మరియు చిన్నపిల్లలకు ఈ చిత్రం అద్భుతంగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ తరం వారికి రామాయణం యొక్క గొప్పదనం వాళ్లకు నచ్చే ఆనిమేటెడ్ సిరీస్ లాగా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. కానీ ఇందులో కొన్ని సన్నివేశాలు మాత్రం ఒరిజినల్ రామాయణానికి కాస్త భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా రావణాసురుడు సీతను అపహరించే సన్నివేశం పై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ బాగుంది అని చెప్పవచ్చు.
చివరి మాట: కుటుంబంతో సహా చూడదగిన ఓ చక్కటి మైతలాజికల్ మూవీ ఆదిపురుష్.. జై శ్రీరామ్….
Web Title: Prabhas Adipurush Review in Telugu, Adipurush Public Talk, Adipurush Review, Adipurush Telugu Review, Adipurush Telugu Movie Review, Adipurush Review and Rating, Adipurush Public Talk