Homeసినిమా వార్తలుఆది పురుష ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ ఫాన్స్ కు సరికొత్త ట్రీట్.!!

ఆది పురుష ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ ఫాన్స్ కు సరికొత్త ట్రీట్.!!

Adipurush Second Trailer details, Prabhas, Krithi Sanon, Adipurush trailer 2, Adipurush pre Release event, Adipurush second trailer, Adipurush AP/TS business, Adipurush Event Photos

Adipurush Second Trailer: ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మైతలాజికల్ మూవీ ఆదిపురుష్. జూన్ 16న గ్రాండ్ లెవెల్ లో ఈ చిత్రం పలు భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా రోజుకు అప్డేట్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తిరుపతిలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రౌండ్స్ లో పూర్తి చేశారు.

Adipurush Second Trailer: ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు క్యారెక్టర్ పోషిస్తున్నారు. అలాగే కృతి సనం సీతగా మరియు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఓం రౌత్ తీస్తున్న ఈ చిత్రం ఒక భారీ విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ ,టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ అన్ని భారీ ప్రజాదరణ పొందడంతో పాటు చిత్రంపై పాజిటివ్ రెస్పాన్స్ ను పెంచాయి.

ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన రామ్ సీతారాం పాటకు భారీ రెస్పాన్స్ లభించింది. ఈ రోజు తిరుపతిలో గ్రాండ్ లెవెల్ లో జరగనున్న ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన్న జీయర్ స్వామి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. ఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు పూర్తి కావడంతో పాటు ఎందరో సినీ ప్రముఖులు మరియు అతిధులు తిరుపతికి తరలివచ్చారు.

డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ ప్రభాస్ కోసం ఈ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో రానున్నట్లు సమాచారం. మరో పక్క ఈ ఈవెంట్ కు హాజరు కావడం కోసం టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తుంది. ఈవెంట్ ను పురస్కరించుకొని ఇప్పటికే తిరుపతి పురవీధుల్లో ప్రభాస్ భారీ కట్ అవుట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

Adipurush Second Trailer on Pre Release Event

 అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఫ్రీ రిలీజ్ వేదిక పైనుంచే సినిమాకు సంబంధించిన సరికొత్త ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్లో చిత్రానికి సంబంధించిన పలు యాక్షన్ ఘట్టాలతో పాటు మరింత ఆసక్తికరమైన సన్నివేశాలు పొందు పరుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ట్రైలర్లో రావణుడి పాత్రను ఎలివేట్ చేయడంతో పాటు రాముడికి రావణుడికి మధ్య జరిగే పోరు శీను కూడా హైలైట్ చేసే విధంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది.

Web Title: Adipurush Second Trailer details, Prabhas, Krithi Sanon, Adipurush trailer 2, Adipurush pre Release event, Adipurush second trailer, Adipurush AP/TS business, Adipurush Event Photos

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY