Homeసినిమా వార్తలుఅంచనాలకు మించి అదిపురుష్ సెకండ్ ట్రైలర్.!!

అంచనాలకు మించి అదిపురుష్ సెకండ్ ట్రైలర్.!!

Prabhas and kriti Sanon Adipurush second trailer, Adipurush second trailer, Adipurush pre Release event, Adipurush release date, Adipurush trailer, Adipurush budget

Adipurush second trailer: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా టోటల్ పాన్ ఇండియా ఎదురుచూస్తున్న భారీ విజువల్ వండర్…’ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో రావణాసురుడి క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో ప్రభాస్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఇంతకుముందు బాహుబలి బాలీవుడ్లో రికార్డు సృష్టించినప్పటికీ అది తెలుగు చిత్రం అవుతుంది కానీ దీని డైరెక్టర్ ఓం రావత్ అవడంతో ఇది ఓ రకంగా హిందీ చిత్రం కిందే పరిగణించబడుతుంది.

Adipurush second trailer: భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ అద్భుతం అని సినీ విమర్శకులు భావిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది కానీ దీనిపై కొన్ని విమర్శలు రావడంతో మార్పుల కోసం కాస్త డిలే అయింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు భారీ స్పందన రావడంతో చిత్రంపై పాజిటివ్ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు మంచి డివోషనల్ టచ్ తో మనసులను ఆహ్లాద పరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మూవీ నుంచి మరో సర్ప్రైజ్ డార్లింగ్ ఫాన్స్ కు ట్రీట్ గా రాబోతోంది. చిత్రం విడుదల డేట్ దగ్గర పడడంతో వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన రెండవ ట్రైలర్ ని జూన్ 6వ తేదీ రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ జూన్ 6న తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ అవుతుంది.

Adipurush second trailer release date

ఇప్పటికే తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పనులు శరవేగంతో జరుగుతున్నాయి. బాహుబలి తరువాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు ఈ చిత్రం మంచి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. వీటితో పాటుగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె, సలార్ లాంటి మూవీస్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

Web Title: Prabhas and kriti Sanon Adipurush second trailer, Adipurush second trailer, Adipurush pre Release event, Adipurush release date, Adipurush trailer, Adipurush budget

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY