Homeట్రెండింగ్Prabhas Adipurush Teaser: ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ & టీజర్ డేట్ ఫిక్స్

Prabhas Adipurush Teaser: ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ & టీజర్ డేట్ ఫిక్స్

Prabhas Adipurush Teaser: నేషనల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ & సాలార్ అలాగే ప్రాజెక్ట్ కె షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ప్రభాస్ నేరుగా చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న విషయం మేకప్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Prabhas Adipurush Teaser & First Look Poster Date: ఆదిపురుష్ అప్డేట్ గురించి ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అలాగే టీజర్ అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఈ రోజు ప్రభాస్ మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడం జరిగింది.

ప్రచారం జరిగిన విధంగానే ఆదిపురుష్ టీజర్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ (Adipurush Teaser & First Look date) ని అక్టోబర్ 2న అయోధ్యలో ఓ భారీ ఈవెంట్ లో విడుదలకు సిద్ధం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు.

జానకిగా కృతిసనన్ నటిస్తోంది. లంకేష్ అనే విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. రామాయ‌ణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్‌. దాదాపు ఐదు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ విడుదల తేదీ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Related Articles

Telugu Articles

Movie Articles