Adipurush Teaser: రాధేశ్యాం సినిమా తరువాత ప్రభాస్ కంటిన్యూగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ భారీ బడ్జెట్ సినిమాల్లో చేస్తున్నాడు ప్రభాస్. బాలీవుడ్లో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక అప్ డేట్ వచ్చింది.
ప్రభాస్ హీరో పాత్రలో రూపొందుతున్న హిందీ, తెలుగు సినిమా ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser) త్వరలోనే విడుదల కాబోతోంది. అక్టోబర్ మూడో తేదీన ఈ సినిమా టీజర్ ను విడుదల చేయుటకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని నవరాత్రి రోజు నుంచి అలాగే ఈ టీజర్ని అయోధ్యలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
బాలీవుడ్ హీరోయిన్ అయిన కృతీ సనన్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రూపొందుతోంది. రామయాణాన్నే ఈ రూపంలో రూపొందిస్తున్నారనే టాక్ ఉంది.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏమటనే మిస్టరీ కూడా టీజర్ విడుదలతోనే తొలగిపోనుంది. అందరూ ఎదురుచూస్తున్న అంటే అక్టోబర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్.