Homeసినిమా వార్తలు70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్ విడుదలకు సిద్ధం.. ప్రభాస్ కోసం అదిరిపోయే ప్లాన్..!!

70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్ విడుదలకు సిద్ధం.. ప్రభాస్ కోసం అదిరిపోయే ప్లాన్..!!

Prabhas Adipurush trailer is all set to be screened in 70 countries, Adipurush trailer global release, Adipurush trailer theaters list, Prabhas

Prabhas Adipurush Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చిత్రం “ఆదిపురుష్”. ఒకరకంగా ఇది పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ అని కూడా చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో అంత రేంజ్ హిట్ ఇంత వరకు పడలేదు…సో ఈ మూవీ పై ఫ్యాన్స్ కే కాదు ప్రభాస్ కు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముఖ్య పాత్ర లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సుమారు 600 కోట్ల బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించారు.

Prabhas Adipurush Trailer: ఆదిపురుష్ టీజర్ మీద మొదట నెగిటివ్ ట్రోల్స్ జరిగినప్పటికీ దర్శకుడు అలాగే మేకర్స్ చాలానే కష్టపడి సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకురావడం జరిగింది. ఆదిపురుష్ ట్రైలర్ ని మే 8న కొన్ని మీడియా ప్రతినిధులకు చూపిస్తూ అలాగే మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని థియేటర్లో కూడా చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 110 థియేటర్ల వరకు ఎంపిక చేయటం జరిగింది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఆది పుష్ ట్రైలర్ ని దాదాపు 70 దేశాల్లో ప్రజలు చూడటానికి ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

Adipurush trailer is all set to be screened in 70 countries

ఇప్పుడు ఈ ఆదిపురుష్ ట్రైలర్ ని (Adipurush Trailer) భారతదేశంలోనే కాకుండా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా USA, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా & దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, UK & యూరప్, రష్యా మరియు ఈజిప్ట్ దేశాలలో విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు చెబుతున్నారు. రామాయణం బ్యాక్ డ్రాప్ కావడంతో ఈ సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి.

ప్రభాస్ సినిమా అంటేనే మామూలుగానే రికార్డులు మోత మోగుతుంది. న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు ఎంపిక కావడం ద్వారా రికార్డు సృష్టించిన ప్రభాస్ కి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇదొక రేర్ ఫీట్ అని చెప్పవచ్చు. ఏ టాలీవుడ్ హీరో కి దక్కని ఈ గౌరవం ప్రభాస్ కి దక్కింది. ప్రభాస్ నటించిన ఈ సినిమాపై మూవీ లవర్స్ అలాగే ఫ్యాన్స్ కి భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం తను చేయబోతున్న సినిమాల అప్డేట్స్ ని కూడా ఇవ్వకుండా ఆపినట్టు సమాచారం. మొత్తం మీద దర్శకుడు అలాగే మూవీ మేకర్స్ ప్రభాస్ కోసం భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ మూవీ లో ప్రభాస్ పక్కన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా…బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి రోల్ లో నటిస్తున్నారు.ఈ మూవీ కు సౌత్ లోనే కాక నార్త్ లో కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి బిజినెస్ కూడా బాగా జరుగుతుందని మూవీ మేకర్స్ ఆశిస్తున్నారు. మొదట్లో చిత్రం పైన నెలకొన్న నెగెటివిటీని కూడా దాటి ఈరోజు చిత్రానికి ఇంత భారీ డిమాండ్ కలుగుతుంది అంటే ఆ ఘనత ప్రభాస్కే దక్కుతుంది అని కొందరు బలంగా నమ్ముతున్నారు. జూన్ 16న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. బాహుబలి నుంచి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ని షేర్ చేస్తుంది అని డార్లింగ్ ఫాన్స్ ఆశిస్తున్నారు.

Web Title: Adipurush trailer is all set to be screened in 70 countries

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY