Aditi Rao Hydari- Siddharth Dating Issue: కొన్ని నెలలుగా సిద్ధార్థ్ అలాగే హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) లవ్ ఎఫైర్ గురించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి… ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న సిద్ధార్థ.. తరవాత అనవసరమైన కొన్ని కామెంట్స్ చేయటం ఆ కామెంట్స్ వైరల్ కావడంతో తనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ అయిపోయాయి.. కొన్ని నెలల క్రితం సినిమా ఒకటి విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల దగ్గర నుంచి అంత ఆదరణ పొందలేదు.
Aditi Rao Hydari- Siddharth Dating Issue: అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించడం జరిగింది. హీరోయిన్ అదితి రావు మాట్లాడుతూ.. ప్రజలకి ఒక టాపిక్ కావాలి.. అది వాళ్ళ ఇంట్రెస్ట్.. అలా మాట్లాడుతూనే ఉంటారు. సో.. వాళ్లను మనం ఆపలేం. వాళ్లకు ఏది ఆసక్తో దాని కోసం వెతుకుతూ ఉంటారు. ఎవరో ఏదో రాస్తున్నారు కదా అని వాటిపైన నేను స్పందించాల్సిన అవసరం లేదు.. నాకంటూ ఒక ప్రైవేటు జీవితం ఉంది దాని గురించి నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది.
మహాసముద్రం సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన వీళ్ళిద్దరి మధ్య స్నేహబంధం అలాగే లవ్ ఎఫైర్ అంటూ చాలా పత్రికలు అలాగే సోషల్ మీడియాలోనూ ప్రచారాలు జరిగాయి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు అలాగే ఒకే కారులో ఫారిన్ ట్రిప్పులకు వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఇద్దరి మధ్య ఉన్న ఎటువంటి బంధం అనేది వీళ్ళు ఇంతవరకు బయట పెట్టలేదు.