Not Doing That Film Anymore_ Adivi Sesh-min
Not Doing That Film Anymore_ Adivi Sesh-min

క్వాలిటీ ఉన్న థ్రిల్లర్ కథలతో సూపర్ అనిపించుకుంటున్న అడివి శేష్ మళ్ళీ ఇప్పుడు ఎవరు అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చి మళ్ళీ హిట్ అందుకున్నాడు.ఈసారి సినిమా రిలీజ్ కి ముందే సెలబ్రిటీలకు,మీడియాకు మాత్రమే కాకుండా పబ్లిక్ కి కూడా ముందే రోజే ప్రీమియర్స్ వెయ్యడంతో ముందే సినిమా టాక్ బయటికి వచ్చింది.సినిమా సూపర్ గా ఉంది అనే పబ్లిక్ టాక్ వల్ల శేష్ గత సినిమా గూఢచారి కంటే రెండింతల ఫస్ట్ డే షేర్ కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన రణరంగం కంటెంట్ వీక్ అని తేలిపోవడం,పోటీగా మరే సినిమా కూడా బరిలో లేకపోవడంతో ఎవరు? యునానిమస్ విన్నర్ అనిపించుకుంది.

ఇక ఓవర్సీస్ లో అయితే ఎవరు? కి ఎదురే లేదు.అలవోకగా హాఫ్ మిలియన్ మార్క్ కి రీచ్ అవుతుంది.అక్కడ ఆల్రెడీ శేష్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.ఆ పోజిటివిటీ కూడా బాగా కలిసొస్తుంది.దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్ కి కూడా లాభాల పంట పడినట్టే.ఇక రీసెంట్ గా ఈ సినిమా చూసిన బన్నీ టీమ్ ని ప్రశంసిస్తూ ఓపెన్ లెటర్ రాసాడు.ఇలా అన్ని రకాల ఫ్యాక్టర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యి ఎవరు? సినిమా ఎవ్వరూ ఊహించనిరేంజ్ కమర్షియల్ హిట్ గా నిలవడం ఖాయం అని తేలిపోయింది.

 

Consider these articles: