అనారోగ్యంతో ఆసుపత్రిలో అడవి శేష్..!

0
51
Adivi Sesh infected with Dengue and hospitalized

Adivi Sesh: అడివి శేష్ తీవ్ర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత వారం అడివి శేష్‌కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయట. దీంతో అడివి శేష్ సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం హీరో అడవి శేష్ ను డాక్టర్లు చాలా దగ్గరగా ఉంటూ పరీక్షిస్తున్నారు. అడవి శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అడవి శేష్ కి డెంగ్యూ సోకిందని తెలియడంతో అయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘మేజర్’లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది.

Also Read: ఐటీ దాడులపై సోనూసూద్ స్పందన..!

Adivi Sesh infected with Dengue and hospitalized

 

Previous articleఐటీ దాడులపై సోనూసూద్ స్పందన..!
Next articleక్రేజీ కాంబినేషన్ ‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో స్టార్ హీరో మూవీ..!