ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘మేజర్’ అనౌన్స్ మెంట్

138
Adivi sesh Major movie Update Announcement Today Evening
Adivi sesh Major movie Update Announcement Today Evening

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు అడవి శేషు. ఈ సినిమాల తర్వాత ‘మేజర్’ సినిమా వస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూపర్ మహేష్ కు చెందిన బీఎంజీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సోనీ పిక్చర్స్ శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశికిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

 

శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2006లో ముంబైలో పాకిస్తాన్ టెర్రరిస్టులు సాగించిన ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. ఆయన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వచ్చే జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. రేపు ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మేజర్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.