Adivi Sesh Regina Cassandra, EVARU Telugu Trailer, Cast
Adivi Sesh Regina Cassandra, EVARU Telugu Trailer, Cast

క్షణం,గూఢచారి సినిమాలతో థ్రిల్లర్ జోనర్ లో మాస్టర్ గా పేరుతెచ్చుకున్న అడివి శేష్ బ్రాండ్ మార్క్ తో తెరకెక్కిన మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ మూవీ ఎవరు?.ది ఇన్విజిబుల్ గెస్ట్ కి కాస్త మార్పు చేర్పులతో,టైట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని తెరకెక్కించారు అని ప్రచారం జరిగింది.ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

ఒక రేప్ జరిగింది అని మొదలైన సినిమాలో ఆ తరువాత ఒక మిస్సింగ్ కేస్,ఫైనల్ గా ఒక మర్డర్ లాంటి విషయాలతో ఊహించని మలుపులతో ఈ టోటల్ మిస్టరీకి కారణం ఎవరు అనే యాంగిల్ లో సినిమా నడుస్తుంది.సినిమా అంతా కూడా అడివి శేష్ సినిమాల్లో ఉండే క్లియర్ అండ్ గ్రిప్పింగ్ విజువల్ అప్పీల్ మాత్రం మిస్ అవ్వలేదు.ఇక మ్యూజిక్ కూడా వెస్టర్న్ స్టైల్ లో సాగుతుంది.తక్కువ బడ్జెట్ అయినా కూడా విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉండేలా మ్యానేజ్ చేసారు.రెజీనా,అడివి శేష్,నవీన్ చంద్ర లాంటి ఆర్టిస్టుల ప్రెజెన్స్ తో సినిమా స్థాయి పెరిగింది.

అలాగే ఆద్యంతం మలుపులతో సాగే నాణ్యమైన థ్రిల్లర్ చూడబోతున్నారు అనే క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చింది ఎవరు ట్రైలర్.అడివి శేష్ గత సినిమాల్లానే ఇది కూడా టైటిల్ కి కట్టుబడి,టైట్ లైన్ తో తెరకెక్కింది అని అర్ధమవుతుంది. PVP నిర్మాణంలో వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే అడివి శేష్ ని టాలీవుడ్ హిచ్ కాక్ అనేస్తారేమో.