తెలంగాణ యాస భాషతో విజయ్ దేవరకొండ తర్వాత విశ్వక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఫలక్ నుమా దాస్ .. హిట్ వంటి చిత్రాల్లో నటించిన అతడికి కెరీర్ పరంగా ఛాన్సులకు కొదవేమీ లేదు. విశ్వక్ సేన్ హోమీ సైడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ ‘హిట్’. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకుల్ని భలేగా థ్రిల్ చేసింది. శేలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నానీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ తెరకెక్కబోతోంది. అయితే `హిట్` సీక్వెల్ లో విశ్వక్ నటించడం లేదని.. చిత్ర నిర్మాత నాని వేరొక హీరోని ఎంపిక చేసుకున్నారని ప్రచారమవుతోంది.
విశ్వక్ ని రీప్లేస్ చేస్తూ హిట్ మూవీలో గూఢచారి ఫేం అడివి శేష్ నటిస్తారని.. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అడివి శేష్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి కింగ్ ఆఫ్ థ్రిల్లర్స్. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ లాంటి సినిమాలతో సాలిడ్ హిట్స్ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం ‘మేజర్’ అనే బయోపిక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఇప్పటికే దర్శకుడు సైలేష్ స్క్రిప్టు రెడీ చేశారని తెలుస్తోంది. సీక్వెల్లో శేష్ తప్ప మరెవరూ కథానాయకుడిగా నటించరన్న ప్రచారం నిజమా కాదా? అన్నది దర్శకనిర్మాతలే ధృవీకరించాల్సి ఉంటుంది.
అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. ఐతే అడివి శేష్ చేస్తున్న బయోపిక్ ముంబై అటాక్స్ లో వీరమరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తిక్కశశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వర్క్ కంప్లీట్ కాగానే.. అడివి శేష్ ‘హిట్ 2’ మూవీకోసం రెడీ అవుతాడు. మరి రెండో సారి ‘హిట్’ ఇంకెలాంటి ఆసక్తికరమైన మర్డర్ స్టోరీతో తెరకెక్కుతుందో చూడాలి.