మహిళల ఇమేజ్ పెంచే సందేశాత్మక అంశంతో “Tempt Raja” చిత్రాన్ని మలుస్తున్నామని దర్శక, నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) తెలిపారు. ఇందులో ఆయన హీరోగా కూడా నటించగా..దివ్యారావు, ఆస్మ హీరోహీరోయిన్లుగా నటించారు. సే క్రియేషన్స్ పతాకంపై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో,, నిర్మాత రాంకి మాట్లాడుతూ…”యువతరాన్ని బాగా ఆకట్టుకునేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. అడల్ట్ కామెడీతో ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. లోగడ విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు విశేష స్పందన లభించింది. అలాగే .ఇప్పుడు విడుదల చేసిన టీజర్ కి అద్భుత స్పందన వస్తోంది.. హీరోయిన్లు ఇద్దరూ తమతమ పాత్రలలో ఒదిగిపోయారు. ఇక పోసాని కృష్ణ మురళి తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది.పోసాని హాస్యం సినిమాకు మంచి ఆకర్షణ అవుతుంది. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆయన అలరింపజేస్తారు.. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ను సున్నితంగా ఇందులో ఆవిష్కరించాం అని చెప్పారు.
ఈ చిత్రంలో ఇంకా జోగి బ్రదర్, యాంకర్ శ్యామల, జయవాణి, అశోక్ కుమార్, టార్జెన్, గౌతంరాజు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మేఘన చౌదరి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని రాజు, పాటలకు సంగీతాన్ని:హరి గౌర, రీరికార్డింగ్ తమిరి శంకర్ సమకూర్చగా…సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కాసర్ల శ్యామ్, సంబాషలను రాంకి, జి.రవి, విజయ్ అందించారు.