సుకుమార్ తో చిరు పొలిటికల్ థ్రిల్లర్ ఫిక్స్..!

After Koratala's film, Chiru to work with sukumar Lucifer remake
After Koratala's film, Chiru to work with sukumar Lucifer remake

(After Koratala’s film, Chiru to work with sukumar Lucifer remake.. Megastar Chiranjeevi – Sukumar To Collaborate For Lucifer) మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి చిత్రం ఎవరితో చేస్తారనేది ఇంకా ఫిక్స్ కాలేదు. మెగాస్టార్ ఎవరి తో చేస్తారనే విషయం పై మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మెగా హీరో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సుకుమార్ మరో మెగా హీరో చరణ్ నటించిన రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇప్పటి వరకు సుకుమార్ ఏడు సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు సినిమాలు మెగా హీరోలతో చేసినవే. బన్నీ తో ఆర్య, ఆర్య 2 చేసిన సుకుమార్ చరణ్ తో రంగస్థలం చేశారు.

చిరు తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ తో చేసే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయట.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నారు. ఈ సినిమాను చిరంజీవి హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నరట. ‘లూసిఫర్’ లో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి నటిస్తారని సమాచారం. ఈ సినిమా ను మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చే బాధ్యతను సుకుమార్ కు అప్పగించారట. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నారట.

బన్నీతో మూవీ పూర్తయిన అనంతరం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసి మెగాస్టార్ తో మూవీ మొదలుపెడతాడట సుకుమార్. ఇదే కనుక జరిగితే సుకుమార్ వరుసగా మూడు చిత్రాలు మెగా హీరోలతో చేసినట్లవుతుంది. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదని అంటున్నారు.