Akhil Agent USA Review: అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ఏజెంట్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఏజెంట్ సినిమాని తెలుగు అలాగే మలయాళం లో విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఈరోజు USA ప్రీమియర్ ఇప్పటికే మొదలైపోయాయి అలాగే ఏజెంట్ మూవీ రివ్యూ కూడా బయటికి వచ్చేసింది. భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి ఏజెంట్ మూవీ విజయాన్ని ఇచ్చిందో లేదో USA ఆడియన్స్ ద్వారా తెలుసుకుందాం.
Akhil Agent USA Review: స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ ఏజెంట్ సినిమాకి చాలానే కష్టపడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలాగే టీజరు సినిమా పై ఆసక్తి కలిగేలా చేశాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఏజెంట్ మూవీ లో మమ్ముట్టి కీలకమైన పాత్రలో నటించారు అలాగే ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా చేసింది. ఏజెంట్ సినిమాని చూసిన USA ఆడియన్స్ పాజిటివ్ గానే రెస్పాండ్ అవ్వటం జరిగింది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అలాగే, హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చారు.. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇంత భారీ యాక్షన్ అలాగే కిక్ ఇచ్చే సినిమా ఇంతవరకు చూడలేదు అంటూ.. సినిమా మొత్తం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంది అంటూ చెప్పుకోవచ్చారు. అఖిల్ ఎప్పుడు నుంచో ఎదురుచూస్తున్న భారీ విజయాన్ని ఈ ఏజెంట్ సినిమా ద్వారా దక్కినట్లే అని అంటున్నారు.
Akhil Agent USA Review: ఇక ఏజెంట్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ముగ్గురు రా ఏజెంట్ మధ్య జరిగే కథ అంటున్నారు. అలాగే ఒక మిషన్ కోసం ముమ్మట్టి టీం అఖిల్ ని సెలెక్ట్ చేసి రంగంలోకి దించటం.. తనకి అప్పగించిన బాధ్యతల్ని అఖిల్ పూర్తిచేసే సమయంలో తను ఎదుర్కొన్న సమస్యలు అలాగే కామెడీ సన్నివేశాలు సినిమాకి పెద్ద హైలెట్ అని చెబుతున్నారు.. అఖిల్ మమ్ముట్టి మధ్య జరిగే సన్నివేశాలు గూస్ బమ్బ్స్ తెప్పిస్తాయని అలాగే మమ్ముట్టి టీం ఏజెంట్ అఖిల్ ని చంపటానికి ప్రయత్నించినప్పుడు వచ్చే సన్నావేశాలు చాలా బాగున్నాయి అని అంటున్నారు.
జేమ్స్ బాండ్ సినిమాలో చూసిన విధంగా స్పై యాక్షన్ సినిమాల్లో ఉండవలసిన అదిరిపోయే స్టాండ్స్, గన్నుతో బుల్లెట్ల వర్షం కురిపించడం ఇలాంటివి చాలానే అంశాలు ఉన్నాయని అవన్నీ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ బాగానే కష్టపడ్డారని తన పర్ఫామెన్స్ కూడా చాలా బాగుందని.. ఈ సినిమాతో అఖిల్ కి హిట్ అందించే సినిమా లాగా ఉందని పాజిటివ్ టాక్ అయితే USA ఆడియన్స్ నుంచి వస్తుంది. హిప్ హాప్ అందించిన మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయంట..
ఏజెంట్ సినిమాకి మేకర్స్ భారీగానే ఖర్చు పెట్టారని అలాగే ప్రతి ఫ్రేములో ఆ ఖర్చు కనబడుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. సమ్మర్ లో మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి అఖిల్ ఏజెంట్ సినిమా ఒక పండుగ లాగా ఉంటుందని పేర్కొంటున్నారు..