‘ఆత్రేయ’ దర్శకుడి కొత్త సినిమా

0
488
'Agent Sai Srinivas Athreya' director's new movie announced!

Swaroop RSJ New Movie: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జె (Swaroop RSJ) తన రెండో సినిమాను ప్రకటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో ఆయన ఈ సినిమాను చేస్తున్నారు. దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో ఒక ఇంటరెస్టింగ్ ఫిలిం నిర్మిస్తున్నామనీ, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ పేర్కొంది.

ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అయిన మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలో స్వరూప్ తన రెండో సినిమాను చేస్తున్నారు. త‌న రెండో చిత్రం కోసం ఒక యూనిక్ స‌బ్జెక్ట్‌ను స్వరూప్ ఎంచుకున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ సినిమా క‌థ తిరుప‌తి స‌మీపంలోని ఓ గ్రామంలో ఒక నిధి అన్వేష‌ణ నేప‌థ్యంలో జ‌రుగుతుంది.

ఈ సినిమా ప్రకటన సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన పోస్టర్ సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేసేలా ఉంది. గ్రామీణ నేప‌థ్యం ఉట్టిప‌డుతున్న విధంగా బ్యాగ్రౌండ్ క‌నిపిస్తున్న ఈ పోస్టర్‌లో శిథిలావ‌స్థలో ఉన్న ఓ గోడ‌పై ఒక కోడి నిల్చొని ఉంటే, ఆ గోడ మీద ‘వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్’ అనే హెడ్డింగ్‌తో ఓ పోస్టర్‌ను అంటించారు.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు పొందిన స్వరూప్ ఆర్ఎస్జె మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థం అవుతోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ వంటి భారీ చిత్రాలను నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here