Agent Sai Srinivasa Athreya ,Box office Collections
Agent Sai Srinivasa Athreya ,Box office Collections

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ…ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.కాన్సెప్ట్ రివీల్ అయ్యాక ఇండస్ట్రీ వర్గాలవరకు కాస్త పాజిటివ్ బజ్ వచ్చింది.కానీ సినిమా మార్నింగ్ షో పడ్డాక మాత్రం సిట్యుయేషన్ చేంజ్ అయిపోయింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్ టికెట్ కౌంటర్ దగ్గర కూడా ప్రతాపం చూపిస్తున్నాడు.నాలుగు సినిమాల మధ్యన వచ్చినా అంతా ఈ సినిమాకే వోట్ వేస్తున్నారు.దాంతో కమర్షియల్ గా కూడా గెలిచాడు ఏజెంట్ ఆత్రేయ.ఈ సినిమాకి ఫస్ట్ నుండి సెలబ్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నా ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ,అడివి శేష్ లాంటి వాళ్ళు స్వయంగా సినిమా ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు.వాళ్ళ ప్రొమోషన్ వల్ల కలెక్షన్స్ ఖచ్చితంగా పెరుగుతాయి.వీక్ ఎండ్ లో కొత్త సినిమాలు వస్తున్నా ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన ఏజెంట్ జోరు మాత్రం తగ్గేలా లేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

డొమెస్టిక్ మార్కెట్ లోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఆత్రేయ జోరు కొనసాగుతుంది.ఫస్ట్ వీకెండ్ కి లక్ష డాలర్స్ కొల్లగొట్టి పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టాడు.ప్రీమియర్స్ తో కలుపుకుని ఇప్పటికే లక్షన్నర డాలర్స్ కలెక్ట్ చేసిన ఈ సినిమాకి రోజురోజకి ఆదరణ పెరుగుతుండడంతో ఆత్రేయ హాఫ్ మిలియన్ సునాయాసంగా రీచ్ అవుతాడు అనిపిస్తుంది.కానీ ఇంత చిన్న సినిమా హాఫ్ మిలియన్ రాబడితే అది బ్లాక్ బస్టర్ రేంజ్ సక్సెస్ అవుతుంది.ఇప్పటికయితే జోరు మీదున్న ఆత్రేయ ముందు ముందు ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]