ఆహా’లో ‘పొగ‌రు’, ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ ప్రీమియ‌ర్స్‌

0
33
aha OTT announces the Telugu premiere of Pogaru and 30 Rojullo Preminchadam Ela

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.. తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఈ వారాంతంలో డ‌బుల్ ట్రీట్ అందించ‌డానికి సిద్ధ‌మైంది. హై ఓల్టేజ్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పొగ‌రు’, పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో రూపొందిన ప్రేమ క‌థా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రాలు జూలై 2న ‘ఆహా’లో ప్రసారమ‌వుతున్నాయి. .

ధృవ్ స‌ర్జా, గీతా గోవిందం ఫేమ్ ర‌ష్మిక మంద‌న్న జంటగా..ప‌విత్రా లోకేశ్, ధ‌నంజ‌య‌, ర‌వి శంక‌ర్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించిన ‘పొగ‌రు’ చిత్రాన్ని నంద కిశోర్ తెర‌కెక్కించారు. ధూళిపూడి ఫ‌ణి ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రం ద్వారా ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా న‌టించ‌గా, అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. 


‘పొగ‌రు, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రాల‌తో పాటు ‘క్రాక్‌, నాంది, జాంబి రెడ్డి, లెవ‌న్త్ అవ‌ర్‌, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా, జీవి, ఎల్‌.కె.జి’ వంటి తెలుగు బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను ఆహాలో వీక్షించండి. సినీ ఔత్సాహికులు ఆహాలో ఎంట‌ర్‌టైనింగ్‌ను ఎంజాయ్ చేయండి.