‘ఆహా’కి మూడు కొత్త చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్

0
6334
Aha OTT bought most eligible bachelor, love story and Lakshya digital rights

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని,నాణ్య‌మైన హండ్రెడ్ ప‌ర్సెంట్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌డానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంటుంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ భారీ స్థాయిలో సినిమాలను, వెబ్ సిరీస్‌లను, టాక్ షోస్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది.

ఇదే క్రమంలో తాజాగా అక్కినేని నాగ చైతన్య – సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’, అఖిల్ – పూజ హెగ్డే నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’, నాగశౌర్య – కేతిక శర్మ నటిస్తున్న ‘లక్ష్య’ చిత్రాల డిజిటల్ రైట్స్‌ను ‘ఆహా’ పొందింది. థియేటర్లలో రిలీజైన తర్వాత వీటీని స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఆహాలో ప్ర‌సార‌మైన ‘సామ్ జామ్’ వెబ్ షో సాధించిన తిరుగులేని విజ‌యంతో మ‌రిన్ని నాన్ ఫిక్ష‌న‌ల్ కంటెంట్ ఆహాలో ప్రేక్ష‌కుల‌ను మెస్మైరైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అలాగే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులైన సూప‌ర్‌స్టార్ ర‌వితేజ‌, రానా, కార్తి, స‌మంత‌, త‌మ‌న్నా, అల్ల‌రినరేశ్‌, ఫ‌హాద్ ఫాజిల్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లైన ‘క్రాక్‌, సుల్తాన్‌, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, నెంబ‌ర్ వ‌న్ యారి, ట్రాన్స్’ వంటి , డిఫ‌రెంట్ కంటెంట్‌కు ‘ఆహా’ నిల‌యంగా మారింది.