Anand Devarakonda Highway Shooting: ఎప్పుడూ అందరిని సరికొత్తగా అలరించే “ఆహా” ఈసారి మరోకొత్త కథ తో మన ముందుకు వచ్చేస్తుంది. ఆహా ”హైవే” అనే సినిమాతో త్వరలో అందరి ముందుకి రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆహా స్క్రీన్స్ మీద రాబోతుంది.
కథ విషయానికివస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ ‘డి’ అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన తులసిని కాపాడుకోగల్గుతాడా? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ సినిమా ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను ఆహా ఆగష్టు 6న ఆవిష్కరించింది.
ఆహా సినిమా అంటేనే ఆహా అని అందరు అంటారు. అందుకు నిదర్శనమే ”కలర్ ఫోటో”. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలిం గా అవార్డు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆహా ఇప్పుడు ”హైవే” సినిమా తో మరోసారి అందరి మన్ననలను పొందడానికి సిద్ధమవుతుంది.
Please Do Subscribe to our Channel