OTT News: `ఆహా`లో సరికొత్త హార‌ర్ వెబ్ సిరీస్ `అన్యాస్ టూటోరియ‌ల్`‌

0
1105
Aha Video Announces Women-Majority Web Series – Anya’s Tutorial

Regina Cassandra Anya’s Tutorial: హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో `మెయిల్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, కుడిఎడమైతే` వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు `అన్యాస్ టూటోరియ‌ల్` (Anya’s Tutorial) అనే స‌రికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించ‌డానికి సిద్ధమైంది `ఆహా`. రెజీనా క‌సండ్ర‌, నివేదా స‌తీశ్‌, అగ‌స్త్య కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ప‌ల్ల‌వి గంగిరెడ్డి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ వెబ్ సిరీస్‌ను `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సంస్థ ఆర్కా మీడియా బ్యాన‌ర్‌లో శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. అన్య అనే పాత్ర చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన సిరీస్ `అన్యాస్ టూటోరియ‌ల్`‌. అన్య ఓ పాపుల‌ర్ వెబ్ చానెల్‌ను న‌డుపుతుంటుంది. ఆమె ఇంట్లో ఆత్మ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడు ఆమె జీవితం త‌ల‌కిందుల‌వుతుంది. ఆమె దాన్ని త‌నకు అనుకూలంగా మార్చుకుందా లేక త‌గిన మూల్యం చెల్లించిందా? అనేది తెలియాలంటే అన్యాస్ టూటోరియ‌ల్ చూడాల్సిందేంటున్నారు యూనిట్‌.

ఈ షోతో ద‌ర్శ‌కురాలిగా పరిచ‌యం అవుతున్న ప‌ల్ల‌వి గంగిరెడ్డి ఆహా క్రియేటివ్ టీమ్‌లో స‌భ్యురాలు. తొలి ప్రాజెక్ట్ అన్యాస్ టూటోరియిల్‌ను ఆర్కా మీడియా సంస్థ‌లో చేయ‌డం విశేషం. అక్టోబ‌ర్ నెల‌లో అన్యాస్ టూటోరియల్ షూటింగ్ పూర్తి చేస్తారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ ఏడాదిలో క్రిస్మ‌స్ వారాంతంలో విడుడ‌ద‌ల చేస్తారు. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది.

Regina Cassandra new web series name Anya’s Tutorial

ఒక్కొక్క ఎపిసోడ్ వ్య‌వ‌ధి ముప్పై నిమిషాలుంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి క్రాక్‌, జాంబి రెడ్డి, నాంది, చావు క‌బురు చ‌ల్ల‌గా, సుల్తాన్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, అర్ధ శ‌తాబ్దం, కాలా, లుకా, షైలాక్‌, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, కుడిఎడ‌మైతే షోస్‌, సినిమాలు బెస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాయి.