aishwarya rai bachchan may acting with prashanth in andhadhun tamil remake

aishwarya rai bachchan: బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాపై దక్షిణాది సినీ పరిశ్రమ ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తమిళ రీమేక్‌లో నటించే హీరో, దర్శకుడి పేర్లను అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇందులో టబు పాత్రలో తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా, నభానటేష్‌ను హీరోయిన్‌గా ఓకే చేసేశారు. తమిళ రీమేక్‌లో హీరోగా ప్రశాంత్ నటిస్తుండగా, టబు పాత్ర కోసం మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను సంప్రదించినట్లు తియగరాజన్ తెలిపారు. అయితే అధికారికంగా ఎలాంటి వార్తలు బయటకు రాలేకపోవడంతో ఐశ్వర్య నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ లేదు.

ప్రశాంత్ గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఫెడ్రిక్ జేజే తాజాగా జ్యోతిక నటించిన పోన్‌మంగల్ వంధాల్‌కు దర్శకత్వం వహించారు. గతేడాది తెలుగులో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ప్రశాంత్‌.. రామ్‌చరణ్‌కు అన్నగా నటించిన విషయం తెలిసిందే. ‘అంధాధున్’ రీమేక్ కోసం ఆయన ఏకంగా 23 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం.