Aishwarya Rajesh, Telugu Movie news,
Aishwarya Rajesh, Telugu Movie news,

ఐశ్వర్య రాజేష్…తమిళ్ లో టాప్ యాక్ట్రెస్.పాత్ర చిన్నదయినా,పెద్దదయినా దానిని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చెయ్యగల టాలెంట్ ఆమె సొంతం.కానీ నిజానికి ఆమె తెలుగమ్మాయి.నిన్నటితరం నటుడు అయిన రాజేష్ కూతురు.కమెడియన్ శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు.అమర్ నాథ్ కి మనుమరాలు.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ రాజేష్ తమిళనాడులో సెటిల్ అవ్వడంతో అక్కడే పెరిగిన ఐశ్వర్య రాజేష్ ముందు నుండి కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలే ఎంచుకుంటూ వచ్చింది.క్యారెక్టర్ నచ్చకపోతే రిజెక్ట్ చెయ్యడం,పాత్ర నచ్చితే నిడివి కూడా పట్టించుకోకపోవడం అనేవి ఆమె స్ట్రాంగ్ గా ఫాలో అయ్యే స్ట్రిక్ట్ రూల్స్.నవాబ్,స్వామి స్క్వేర్ సినిమాల్లో ఆమె చేసిన అతి చిన్న పాత్రల్లోనే ఆమె నటన చూసి ఇంప్రెస్ అయ్యి ఎవరా అని ఆరా తీసి ఆశ్చర్యపోయారు.ఇప్పటికే తమిళ్,మలయాళం,హిందీ కలుపుకుని 30 కి పైగా సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

మూడు సినిమాలతో హోమ్ గ్రౌండ్ లో కూడా తన హిట్ ఫామ్ కొనసాగించడానికి రెడీ అయిపోయింది.తమిళ్ లో ఆమె నటించిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా కణా సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు ఆ సినిమానే తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేసారు.అప్ కమింగ్ హీరో ఉదయ్ శంకర్ తో మిస్ మ్యాచ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న ఐశ్వర్యా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది.క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి.ఆ మూడు సినిమాలు ఇప్పటికి రిలీజ్ కాలేదు.కానీ బ్యాక్ టు బ్యాక్ అతి తక్కువ టైం లో ఆ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.అవి రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉన్నా ఐశ్వర్యా రాజేష్ తెలుగు సినిమాలతో ఊపిరి సలపన్త బిజీ గా మారడం ఖాయం.కాకపోతే కథ నచ్చకపోతే రిజెక్టెడ్ అనేది మాత్రం గ్యారంటీ.

[INSERT_ELEMENTOR id=”3574″]