Aishwarya Rajesh to replace Nivetha Pethuraj in Sai Dharam Tej's upcoming film

Sai Dharam Tej: దాదాపు ఆరు నెలలకు పైగా షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉండటంతో అప్పటికే కమిటైన అన్ని సినిమాలు అటకెక్కాయి. ఇక ఇప్పుడు లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌కి అనుమతి రావడంతో వరుసగా అన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి. టాలీవుడ్ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తోన్న ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్ గా నివేదా పేతురాజ్ ను హీరోయిన్ గా ఫైన‌ల్ చేశాడ‌ట డైరెక్ట‌ర్.

తాజాగా యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ డేట్స్ అడ్జస్ట్ కాక మెగా మేనల్లుడి సినిమా నుంచి తప్పుకుందట. డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ చాలా కష్టమవుతోందని భావించిన ఈ బ్యూటీ సాయి ధరమ్ తేజ్‌తో చేయబోతున్న కొత్త సినిమా క్యాన్సిల్ చేసుకుందని టాక్. దీంతో ఆమె స్థానంలో కౌసల్యాకృష్ణ‌మూర్తి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఐశ్వ‌ర్యా రాజేశ్‌. ఈ భామను డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. భగవాన్, జె.పుల్లారావు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో కనిపించనుందట.