Aishwarya Rajesh కి వరుసగా క్రేజ్ ఆఫర్స్..!

0
30
Aishwarya Rajesh upcoming movies 2021 ,2022

Aishwarya Rajesh Movies: ఐశ్వర్య రాజేశ్..తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళ సినిమాలు ఏవి చేసినా పర్ఫార్మెన్స్ కి ఫుల్ స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది ఐశ్వర్య రాజేశ్. తమిళంలో గ్లామర్ హీరోయిన్లను తట్టుకుని నిలబడటం ఇక్కడ చాలా గొప్ప విషయం.

‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో సాగే సినిమాతోనే ఈమె ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆ తరువాత ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేజిక్కుంచుకుంటోంది.

ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి చేతిలో 3 తెలుగు సినిమాలు, 5 తమిళ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు తెలుగు ప్రాజెక్టులు క్రేజీ ప్రాజెక్ట్స్, తన కెరియర్ కి కలిసొచ్చేవి. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రిపబ్లిక్’ లో సాయితేజ్ జోడీగా నటించింది. నాని ‘టక్ జగదీష్’ అంతేకాదు ఏకే రీమేక్ లో రానా సరసన నటిస్తోంది. ఈ మూడు సినిమాల తర్వాత టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా అంటున్నారు.