ajay devgn joins Kamal Haasan's Indian 2 movie shooting
ajay devgn joins Kamal Haasan's Indian 2 movie shooting

స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ – కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తాన్నారు. కాగా తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు వచ్చే షెడ్యూల్ లో అజేయ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్‌ ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెది భారతీయుడు సీక్వెల్‌ లో కీల‌క పాత్ర‌ అట. అందుకే ఆమె పాత్రలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ను తీసుకోవాలని అనుకున్నారు.

కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో జరగబోయే షెడ్యూల్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా షూట్ లో పాల్గొంటుందట. కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. 2020లో ఈ సినిమా విడుదలకానుంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు.