ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గోన్న బాలీవుడ్ హీరో

0
231
Ajay Devgn joins SS Rajamouli to shoot RRR movie after Tanhaji turns hit at the box office
Ajay Devgn joins SS Rajamouli to shoot RRR movie after Tanhaji turns hit at the box office

(RRR Movie Latest Updates: Ajay Devgn joins SS Rajamouli to shoot RRR movie after Tanhaji turns hit at the box office) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించననున్నారు. హలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సముద్రఖని, రే స్టీవెన్‌సన్, ఎలిసన్ డూడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా నేటి షూటింగ్ షెడ్యూల్ నందు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ పాల్గొన్నారు. తాజా షెడ్యూల్ నందు ఆయన పై వచ్చే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉన్న నేపథ్యంలో అజయ్ సెట్స్ కి హాజరయ్యారు. అజయ్ దేవగణ్ ఆర్ ఆర్ ఆర్ లో ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కథ రీత్యా ఓ బలమైన వీరుడి పాత్ర కోసం అజయ్ దేవగణ్ ని తీసుకోవడం జరిగింది. కథలో ప్రాధాన్యం ఉన్న కీలక మైన రోల్ కావడంతో అజయ్, రాజమౌళి ఆఫర్ ని కాదనకుండా ఒకే చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. అజయ్, రాజమౌళితో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటివలే విశాఖ అడవుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతమైన వికారాబాద్ అడవుల్లో చిత్రకరణ జరుపుకుంటుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర విడుదల జులై నుండి అక్టోబర్ కి వాయిదా పడనుందని పరోక్షంగా చెప్పారు.

 

Previous articleVV Vinayak’s Seenayya is ready to roll
Next article‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్: బన్నీ ఖాతాలో మరో రికార్డ్