రికార్డులను తిరగ రాసిన బాలకృష్ణ అఖండ..!!

నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి ఇప్పుడు అఖండ (Akhanda) సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. సింహ, లెజెండ్‌ సినిమాలు అప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధిస్తే.. అఖండ మాత్రం కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ గ్రాస్ సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

Akhanda successfully completes 50 days
Akhanda successfully completes 50 days

ప్రస్తుతం ఉన్న కాలంలో ఓ సినిమా యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడటం మామూలు విషయం కాదు. ఏకంగా 103 కేంద్రాలలో అఖండ (Akhanda) యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇది కేవలం టాలీవుడ్‌లోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమలోనే అరుదైన ఫీట్. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 200 కోట్లు రాబట్టింది.

ఈ మధ్య కాలంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిన చిత్రంగా అఖండ(Akhanda) నిలిచింది. ఓవర్సీస్‌లోనూ చిత్రం లాభాల బాట పట్టింది. యూకే, ఆస్ట్రేలియాలో సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ రాగా అమెరికాలో ఏకంగా వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది.

ఒమిక్రాన్ కేసులు పెరిగినా, పరిస్థితులు బాగా లేకపోయినా కూడా అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రతీ వారం కొత్త సినిమాలు వచ్చినా కూడా అఖండ(Akhanda) మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే వచ్చింది. ఏడో వారంలో కూడా అఖండ(Akhanda) మంచి వసూళ్లను రాబట్టింది.

Balakrishna Akhanda 200 crore box office recoard
Balakrishna Akhanda 200 crore box office recoard

టీం అంతా కలిసి అద్భుతంగా పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. బోయపాటి కథ, మేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్యను రెండు పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ లో చూపించిన విధానం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ద్వారక ప్రొడక్షన్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించారు. జగపతి బాబు ఓ ముఖ్య పాత్రను పోషించారు.

Related Articles

Telugu Articles

Movie Articles