Homeసినిమా వార్తలుఏజెంట్ కొత్త యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మేకర్స్..!!

ఏజెంట్ కొత్త యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మేకర్స్..!!

అక్కినేని అఖిల్ టాలీవుడ్ లో ఎంటర్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ చెప్పుకునే అంత హిట్ తన ఖాతాలో వేసుకోవాలని లేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చిన సినిమా ఒక మోస్తరుగా ఆడినప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు అఖిల్ స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఏజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో మొదలైయింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు. షూటింగ్ లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. అభిమానులు నుంచి వస్తున్న ఈ భారీ స్పందన అఖిల్ కి వున్న క్రేజుకి అద్దం పడుతుంది. ఈ సినిమాని అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్వహిస్తున్నారు.

Akhil Agent Shooting update
Akhil Agent Shooting update

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. ఏజెంట్ గా అఖిల్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.

Related Articles

Telugu Articles

Movie Articles