Akhil Agent Movie Release Date: క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ షూటింగ్ జరుగుతుంది. ఏజెంట్ చివరి దశలో ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ విషయంలో బిజీ అవుతున్నారు. అలాగే ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే సమాచారం మేరకు చిరంజీవి కొత్త సినిమా ప్లేసులోకి అఖిల్ సినిమాని విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది.
Akhil Agent Movie Release Date: అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ మూవీ పోస్టర్స్ అలాగే టీజర్.. సినిమాపై ఆసక్తి కలిగేదా చేయటమే కాకుండా మూవీ లవర్స్ అలాగే ఫ్యాన్స్ ఎప్పుడు విడుదల అవుతుందని ఎదురుచూస్తున్నారు.
సమాచారం మేరకు, చిరంజీవి భోళా శంకర్ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అయితే అనుకోకుండా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల చిరంజీవి సినిమా వాయిదాపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే రిలీజ్ డేట్ ని అఖిల్ ఏజెంట్ సినిమాకి ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే భోళా శంకర్ అలాగే ఏజెంట్ సినిమాలు ఒకే బ్యానర్ అయిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఒకే ప్రొడక్షన్ హౌజ్‌లో రూపొందుతోన్న సినిమాలు కావడంతోనే ఈ డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ ఈజీగానే పూర్తయినట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాని మే 12న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీటిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..