Agent Movie Review: అఖిల్ కెరియర్ లో ఎంతో ముఖ్యమైన సినిమా ఏజెంట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ క్లిక్ అయితే అఖిల్ కెరీర్ కు డోకా ఉండదు అని అక్కినేని అభిమానులు ఎప్పటినుంచో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఏదో కారణం వల్ల రిలీజ్ రిలే అవుతూ వచ్చిన ఈ మూవీ కాస్త ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ సమయంలో అఖిల్ నటి ఊర్వసి రౌతేలాను వేధించాడంటూ ఓ ప్రముఖ సినీ విమర్శకులు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ దుమారం రేపింది.
Agent Movie Review: అతను పెట్టిన అసభ్యకరమైన ట్వీట్కు నటి ఊర్వశి ఆగ్రహం చెందగా ఘాటుగా సమాధానం కూడా ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఫేక్ వార్తలు క్రియేట్ చేయడమే కాకుండా సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఏదో ఒక కొత్త కథ అన్ని పాపులర్ అవ్వాలి అనుకునే సినీ విమర్శకుడు ఉమైర్ సాంధు అని ఆమె అన్నారు. ఇంకొకసారి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని కూడా భూమాలను బెదిరించారు. అయితే ఇది నిన్న మొన్నటి మాట.
ఇప్పుడు తాజాగా ఉమైర్ సాంధు తిరిగి ఏజెంట్ చిత్రం పై తన విమర్శల బాణాలను సంధిస్తున్నాడు. రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉండగా ఇప్పటినుంచి మూవీ గురించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు.
ఏజెంట్ మూవీ (Agent Movie) ఆత్మలేని ఒక అందమైన శరీరం వంటిదని ఉమైర్ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా చిత్రంలో యాక్షన్ మరియు స్టంట్ లు అద్భుతంగా ఉన్నాయి కానీ స్క్రీన్ ప్లే స్టోరీ విషయానికి వస్తే అస్సలు బాగోలేదని.. అలాగే అఖిల్ అక్కినేని (Akhil Akkineni) యాక్షన్ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఉమైర్ అనడం అక్కినేని అభిమానులను అసంతృప్తికి గురిచేసింది.
ఉమైర్ సాంధు చాలా సినిమాలకు ఇదే రకంగా నెగటివ్ కామెంట్స్ ఇంతకుముందు కూడా ఇచ్చి ఉన్నాడు. అయితే కొన్ని సినిమాలు అతని అంచనా ప్రకారం ఉన్నప్పటికీ చాలా వరకు అతని అంచనా తప్పు అనేది సోషల్ మీడియాలో టాక్.
ఇప్పుడు అతను ఏజెంట్ మూవీ గురించి అఖిల్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కు మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఈ చిత్రంపై హాట్ చర్చ నడుస్తోందని చెప్పవచ్చు. మరి ఉమైర్ నెగిటివ్ ప్రచారం ఏజెంట్ కి పాజిటివ్గా కలిసి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఎలా జరుగుతుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే….