Agent New Poster: అఖిల్ తో వైల్డ్ రైడ్ కి రెడీ అవ్వండి

Akhil Akkineni Agent: అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నారు. దీని తరువాత అఖిల్ (Akhil) స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ (Agent) అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుండి ఒక వైల్డ్ పోస్టర్ వచ్చింది.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అఖిల్ (Akhil) తో వైల్డ్ రైడ్ కి రెడీ అవ్వండి అంటూ ట్వీట్ చేసారు. పోస్టర్ లో అఖిల్ (Akhil) నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు తిరిగి వెనుక వైపు ఉండి మరీ వైల్డ్ గా భారీ రైడ్ కి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ పోస్టర్ (Agent Poster) బాగా వైరల్ అవుతుంది.

“ఏజెంట్” (Agent) మూవీ షూటింగ్ జులై 12నుంచి పునః ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో ఆయన ఏజెంట్ పై ఆఫీసర్ గా కనిపించబోతున్నారు అని టాక్.

ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ గతంలో అఖిల్ మిస్టర్ మజ్ను కోసం సంగీతం సమకూర్చారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles