Agent Telugu Movie Review && Rating: అక్కినేని కుటుంబం టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. ఏఎన్ఆర్ నట వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున సూపర్ స్టార్ గా ఇప్పటికీ తన క్రేజ్ ను కాపాడుకుంటున్నారు. కానీ ఆయన ఇద్దరి కొడుకులు ఎవ్వరూ ఆయన స్థాయికి రాకపోవడం అక్కినేని అభిమానులను ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉంది. అఖిల్ అక్కినేని చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం ఏజెంట్. గత కొద్దికాలంగా ఈ చిత్రం గురించి చాలా హైప్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ విడుదల అయింది…మరి ప్రేక్షకులు ఏ స్థాయిలో ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారో తెలుసుకుందాం…
Agent Movie Review & rating: 2/5
నటీనటులు: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డైనో మొరె, సాక్షి వైద్య తదితరులు
దర్శకులు : సురేందర్ రెడ్డి
నిర్మాతలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్
సంగీత దర్శకులు: హిప్ హాప్ తమిజా
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
కథ : రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్ అక్కినేని) రా ఏజెంట్గా అవ్వడం కోసం ఇంట్లో ఎవరికీ తెలియకుండా మూడుసార్లు అతను ఎగ్జామ్ కూడా రాస్తాడు. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినప్పటికీ ఇంటర్వ్యూలో మాత్రం అతను ఎందుకో రిజెక్ట్ అవుతూ వస్తుంటాడు. ఇక ఇలా లాభం లేదు ఎలాగైనా అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్న రామకృష్ణ నేరుగా రా చీఫ్ డెవిల్ అలియాస్ మహదేవ్ (మమ్ముట్టి) యొక్క సిస్టంను హ్యాక్ చేస్తాడు.
రిక్కీ చేసిన ఈ పని వల్ల అతను మహదేవ్ దృష్టిలో పడుతాడు కానీ జాబ్ అయితే మాత్రం రాదు. మరోపక్క రిక్కీ వైద్య ప్రేమలో పడతాడు. ఇక్కడే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.. ఏజెంట్ అయ్యే ఒక్క లక్షణం కూడా నీలో లేదు అన్న మహదేవ్ రిక్కీని గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా)ను పుదిముట్టించడానికి ఎంపిక చేసుకుంటాడు. అసలు ఈ గాడ్ ఎవరు? మహదేవతన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? ఈ మిషన్లో రిక్కి ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: రా ఏజెంట్స్ నేపథ్యంలో గూడచారి కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ప్రతి సినిమాలో కామన్ గా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడని ఓ హీరో, భారతదేశాన్ని నాశనం చేయడమే ప్రధాన లక్షణంగా పనిచేసే ఓ విలన్, మధ్యలో హీరోని గైడ్ చేసే ఒక క్యారెక్టర్ కామన్. ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ మిగతా అన్ని సినిమాల లాగా కథ ఉంది అని చెప్పవచ్చు. ప్రేక్షకులను చివరి వరకు థియేటర్లో కూర్చోబెట్టగలిగే ఎంతో గొప్ప ఎలిమెంట్ అయిన దేశభక్తిని బలంగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది.
ఇక్కడ మనం ఏజెంట్ సినిమాతో కాస్త ‘పఠాన్’ సినిమా ను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వరకు కొన్ని సన్నివేశాలు మరియు క్యారెక్టర్స్ బాగా మ్యాచ్ అవుతాయి. అయితే పఠాన్ జనాల్ని ఆకట్టుకున్నంతగా ఏజెంట్ ఆకట్టుకోలేకపోయింది అని మాత్రం మొదటి రోజే క్లియర్గా అర్థం అవుతుంది. ఈ చిత్రంలో కనీసం భారతదేశంలో భద్రతకు మరో పేరు అయినా రా సంస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయంపై మినిమం రీసర్చ్ కూడా చేయలేదు అని స్పష్టంగా అర్థం అవుతుంది.
మూవీలో రా ఆఫీస్ హెడ్ రూమ్ లో జరిగే ప్రతి విషయాన్ని దేశ ద్రోహులు సీసీ కెమెరాల ఫుటేజ్ లాగా చూడడం విడ్డూరంగా కనిపిస్తుంది. సినిమా నేచురాలిటీకి చాలా దూరంగా ఉంది అని చెప్పవచ్చు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్టోరీ కోసం మంచి స్టోరీ లైన్ ని సెలెక్ట్ చేసుకున్నారు కానీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ లేకపోవడం ఈ సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెప్పవచ్చు. ఎంతో సస్పెన్స్ తో సినిమా మీద భయంకరమైన ఇంట్రెస్ట్ పెంచే స్కోపు ఉన్నప్పటికీ ఏం జరుగుతుందో గెస్ చేసే అంత సింపుల్ గా మూవీ ఉండడం కాస్త మైనస్ అని చెప్పవచ్చు. మ్యూజిక్ అక్కడక్కడ పరవాలేదు అనిపించినప్పటికీ ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఎడిటింగ్ పరంగా నవీన్ నూలి బాగా చేశాడు కానీ అక్కడక్కడ అవసరం లేని సీన్స్ ను కూడా కాస్త ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

ప్లస్ పాయింట్స్:
- రా ఏజెంట్గా అఖిల్ ఫిజిక్ బాగా సెట్ అయింది. దానితోపాటు అతని పర్ఫామెన్స్ కూడా యాక్షన్స్ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకునే విధంగా ఉంది.
- కచ్చితంగా మమ్ముట్టి ఈ చిత్రానికి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన అతని నటన ఎన్నో సన్నివేశాలను స్ట్రాంగ్ గా మార్చింది.
- హీరోయిన్గా చేసిన సాక్షి వైద్య నటన కూడా బాగుంది.
- మురళీ శర్మ మరియు డినో మోరియా తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు అని చెప్పవచ్చు.
మైనస్ పాయింట్స్ :
- సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ మరియు హోం వర్క్ సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది.
- ఎంతో ఇంట్రెస్ట్ గా సాగాల్సిన మంచి ఏజెంట్ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ అక్కడక్కడ డ్రాగింగ్ గా ఉంది.
- మూవీలో కొత్తదనం లేదు చూసినంతసేపు ఏదో రెగ్యులర్ యాక్షన్ డ్రామా చూస్తున్నట్లు అనిపించింది.
- దేశభక్తిని చిత్రానికి అనువైన విధంగా ఉపయోగించలేదు. మూవీ చూస్తే స్టోరీ చాలా తేలికపాటి ఇన్వెస్టిగేషన్ తో ముగిసిన అభిప్రాయం కలుగుతుంది. బాగా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు పెట్టి ఉంటే కాస్తయినా ఆకట్టుకునేది..
తీర్పు : ఏజెంట్ టైటిల్ చూసి మంచి గూడచారి సినిమా అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ వల్ల డిసప్పాయింట్ అవ్వాల్సిందే. అఖిల్ యాక్షన్ పరంగా ఈ మూవీలో పర్వాలేదు మరోపక్క మమ్ముట్టి ఎప్పటిలాగే అతని నటనతో అందరిని ఆక ట్టుకున్నాడు. కానీ అక్కడక్కడ లాజిక్ లెస్ సీన్స్ మరియు ఎక్కువ డ్రాగింగ్ ఉండడం వల్ల సినిమా బాగా బోరింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు అక్కినేని కుటుంబానికి వీరాభిమానులైతే మాత్రం కచ్చితంగా ఈ మూవీకి వెళ్లొచ్చు.