Akhil Akkineni ,Mr.Majnu Movie review, Venky Atluri, Niddhi Aggarwal
Akhil Akkineni ,Mr.Majnu Movie review, Venky Atluri, Niddhi Aggarwal

విడుదల తేదీ : జనవరి 25, 2019
చిత్రంభలరే .ఇన్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, వి జయప్రకాష్ , సితార తదితరులు.
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : ఎస్ తమన్
ఎడిటర్ : నవీన్ నూలి

అఖిల్ తన మొదటి 2 సినిమాలు భారీ బడ్జెట్ తో పేరున్న డైరెక్టర్స్ తో ప్రెస్టీజియస్ బ్యానర్స్ లో చేసినా.. మినిమమ్ రేంజ్ హిట్ కూడా దక్కలేదు. దాంతో రియలైజ్ అయ్యిన అఖిల్ సినిమాల కౌంట్ కంటే.. హిట్ కంటెంట్ ఉన్న సినిమాలు చెయ్యడమే బెటర్ అని కాస్త గ్యాప్ తీసుకుని వెంకీ అట్లూరి తో తన మూడో సినిమా మొదలుపెట్టాడు. తన తొలి ప్రయత్నం తోనే తొలిప్రేమతో మ్యాజికల్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి..అఖిల్ ని ప్లేబాయ్ గా మార్చి అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన మజ్ను టైటిల్ కలిసేలా మిస్టర్ మజ్ను ని తెరకెక్కించాడు.ఈ సినిమా లైన్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండడంతో , ప్రోమోస్ సైతం ఇది ఒక కూల్ ఎంటర్ టైనర్ అనేలా హింట్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. డల్ సీజన్ లో థియేటర్స్ లోకి వచ్చిన మజ్ను ప్రేక్షకులనుఁ ఎంతవరకు ఆకట్టుకున్నాడు?, అఖిల్ ఆశించిన హిట్ దక్కిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ:

విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ.. కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తో పెరిగిన అబ్బాయి.ఫ్లర్టింగ్ లో ఎక్స్ పర్ట్. అలాంటి విక్కీని నిఖిత అలియాస్ నిక్కీ మొదట ద్వేషిస్తుంది. కానీ అతని ఇన్నర్ పర్సనాలిటీ, పాజిటివ్ క్వాలిటీస్ నచ్చి ప్రేమిస్తుంది. ఇదే విషయాన్ని విక్కీకి చెప్తుంది. దాంతో వాళ్లిద్దరూ ఒకరికొకరు కరెక్టా? … కాదా..? అని తెలుసుకుపోవడానికి లవ్ జర్నీని స్టార్ట్ చేస్తారు.ఆ జర్నీలో నిక్కీ ..విక్కీని ఎక్కువగా ప్రేమిస్తే.. విక్కీ మాత్రం ఆబ్లిగేషన్ లా ఫీలవుతాడు. దాంతో హర్ట్ అయిన నిక్కీ..యు.కె వెళ్లిపోతుంది.ఆమె వెళ్లిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి నిక్కీ ప్రేమను పొందాలని..విక్కీ కూడా యు.కె కి వెళ్తాడు. విక్కీ…నిక్కీని కన్విన్స్ చేసే ప్రాసెస్ లో అతను ఎలాంటి కష్టాలుపడతాడు..? తన ప్రేమను నిక్కీకి ఎలా కన్వే చేశాడు..? చివరకి నిక్కీ..విక్కీ ప్రేమను అంగీకరించిందా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

అందరికి తెలిసిన నార్మల్ అండ్ రొటీన్ లవ్ స్టోరీ తో తొలిప్రేమల్ లాంటి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండో సినిమా మిస్టర్ మజ్ను కి కూడా సేమ్ ఫార్మాట్ ఫాలో అయిపోయాడు.ఫస్ట్ హాఫ్ లో నీట్ గా క్యారెక్టర్ ఎస్టాబ్లిషమెంట్స్,స్టోరీ టేక్ ఆఫ్ చేసేలా చూసుకున్న వెంకీ ఫామిలీ ఎమోషన్స్ కూడా మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ వరకు రొటీన్ స్టఫ్ తోనే అందరిని ఎంగేజ్ చేసాడు.

కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కావాల్సిన కంటెంట్ దొరకలేదు.కాన్ఫ్లిక్ట్ పాయింట్ లో ఉన్న లూప్ హోల్ తో ఆ పరిస్థితి ఏర్పడింది.దాంతో కొన్ని క్యారెక్టర్స్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి కామెడీ పూతతో సెకండ్ హాఫ్ నడిపించాలని చూసాడు.ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు.అక్కడక్కడా మెరుపులతో క్లైమాక్స్ కి చేర్చాడు.క్లైమాక్స్ లో మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్,వెంకీ డైలాగ్స్ మాజిక్ అన్నీ వర్క్ అవుట్ అయ్యి లవ్ స్టోరీ కి ఉండాల్సిన ఫీల్ పండింది.ఫస్ట్ హాఫ్ రేంజ్ కి తగ్గకుండా సెకండ్ హాఫ్ ఉండుంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది

నటీనటులు:

అక్కినేని ఫ్యామిలీ నుంచి భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సినిమా ..సినిమాకీ..తనను మెరుగుపరుచుకుంటూ,…యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తన గత 2 సినిమాలతో పోలిస్తే..అఖిల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా మారాయి. అతని స్టైలింగ్ కూడా చాలా బావుంది.నటనలో ఈజ్ కనిపించింది. డాన్సుల్లో, ఫైట్స్ లో ఎప్పటి లానే.. అఖిల్ ఎనర్జీ లెవల్స్ మెప్పించాయి.ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా మెచ్యూరిటీ చూపించాడు.

ఇక సవ్యసాచిలో పేరుకే హీరోయిన్ గా మిగిలపోయిన నిధిఅగర్వాల్ కి ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. కెరీర్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న నిధి చాల ఎఫర్ట్స్ పెట్టినా.. నిక్కీ పాత్రకు పూర్తిగా న్యాయం చెయ్యలేకపోయింది.కానీ ఆమెలో మంచి హీరోయిన్ కి కావల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఈ సినిమాతో లభించింది.

నాగబాబు, రావురమేష్, సుబ్బరాజు, సితార, పవిత్ర లోకేష్ , జయప్రకాష్, అజయ్, సత్యకృష్ణన్, వీళ్లంతా.. సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ లా బాగా సెట్ అయ్యారు. ఇక హైపర్ ఆది, ప్రియదర్శి, విద్యుల్లేఖ అక్కడక్కడా కాస్త నవ్వులు పూయించారు.

టెక్నీషియన్స్:

తొలిప్రేమ సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి రెండో సినిమాతో కూడా రొటీన్ లైన్ నే ఎంచుకున్నాడు. కాకపోతే.మొదటి సినిమాలో క్రియేట్ చేసిన మ్యాజిక్ ఈ సినిమాలో రిపీట్ చెయ్యడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ వరకూ తన మార్క్ ఎమోషన్స్, లవబుల్ సీన్స్ తో ఆకట్టుకున్న వెంకీ సెకండాఫ్ కి వచ్చే వరకూ బాగా రొటీన్ దారి పట్టాడు.

చాలాచోట్ల క్లూలెస్ గా కనిపించాడు. కామెడీ కూడా మొదటి సినిమాతో కంపేర్ చేస్తే చాలా వరకూ తగ్గింది. క్లైమాక్స్ సీన్స్ లో వెంకీ డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. ఇక కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్న తమన్..ఈ సినిమాకి మనసు పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలతోనే మెప్పించి మిస్టర్ మజ్ను పై పాజిటివ్ వైబ్స్ కల్పించిన తమన్..ఆర్.ఆర్ విషయంలో కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు.ప్రతి సీన్ లో ఉన్న కంటెంట్ ఇంపాక్ట్ ని రెట్టింపు చేశాడు.

జార్జ్.సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమాకి స్టైలిష్ అండ్ లావిష్ లుక్ తీసుకురావడంలో జార్జ్ హార్డ్ వర్క్ చాలా ఉంది. ఇక వెంకీ టాలెంట్ ని నమ్మి..ఈ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెట్టారు నిర్మాత. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

ఓవరాల్ గా :

అఖిల్ తో పాటు..అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మజ్ను ఫస్టాఫ్ వరకూ ఆకట్టుకున్నా..సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించింది. కాకపోతే..యూత్ అప్పీల్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే కొన్ని క్వాలిటీస్, ఎమోషన్స్ కూడా ఉండడంతో A సెంటర్స్ లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. b,c సెంటర్స్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా కనెక్ట్ అయిపోతుంది.