Akhil Akkineni ,Allu Aravind,
Akhil Akkineni ,Allu Aravind,
Akhil Akkineni ,Allu Aravind,
Akhil Akkineni ,Allu Aravind,

అఖిల్ రాత ఎప్పుడు మారుతుందో,మరో మహేష్ బాబు అంటూ కోటి ఆశలు పెట్టుకున్నఅక్కినేని అభిమానులకి సెలబ్రేషన్ మూమెంట్ ఎప్పుడు వస్తుందో? అనేది ఎవ్వరూ ఆన్సర్ చెప్పలేని ప్రశ్న.మూడు సినిమాలు వచ్చాయి,వెళ్లాయి….అంతకుమించి అఖిల్ కెరీర్ కి ఉపయోగపడే సినిమా ఒక్కటీ రాలేదు.చాలా ట్రై చేసిన నాగ్ అఖిల్ బాధ్యత అల్లు అరవింద్ కి అప్పగించేసాడు.

ఆయన కథ,డైరెక్టర్ ని సెట్ చేసాడుగానీ అఖిల్ కి తగ్గ హీరోయిన్ ని మాత్రం సెట్ చెయ్యలేకపోతున్నాడు.హీరోయిన్ ఓకే అనుకుంటే పేమెంట్ దగ్గర తేడా వస్తుంది,పేమెంట్ ఓకే అనుకుంటే ఆ కంటెంట్ ని ఎలివేట్ చేసే హీరోయిన్ దొరకట్లేదు.పోనీ రెండూ ఓకే అనుకుంటే ఆ హీరోయిన్ అఖిల్ పక్కన సెట్ కావట్లేదు.రష్మిక నుండి ప్రియాంక జవాల్కర్ వరకు చాలా అషన్స్ అనుకున్నారు.కానీ ఎవ్వరూ సెట్ కాక సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు.దీంతో కొత్త హీరోయిన్ అనే ఆప్షన్ పైనే వర్క్ చేస్తున్నారు.అఖిల్ కి హీరోయిన్ దొరికేది ఎప్పుడో,సినిమా మొదలయ్యేది ఎప్పుడో,ఆ సినిమా రిలీజ్ అయ్యి అక్కినేని అభిమానుల ఆశలు తీరేది ఎప్పుడో.