Akhil Akkineni Next Movie With Geetha Govindam Director Parasuram
Akhil Akkineni Next Movie With Geetha Govindam Director Parasuram

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పరుశురామ్, తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదు. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ – అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. పరుశు రామ్ ఆ మధ్య అఖిల్ కి ఒక లైన్ చెప్పినట్లు.. లైన్ విన్న అఖిల్ అండ్ నాగార్జున ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక అఖిల్ కి ‘మిస్టర్ మజ్ను’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో తన తరువాత సినిమాల పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.