అదరకోటినా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫస్ట్ లుక్

Akhil and Bommarillu Bhaskar Most Eligible Bachelor first look poster
Akhil and Bommarillu Bhaskar Most Eligible Bachelor first look poster

(Akhil and Bommarillu Bhaskar Most Eligible Bachelor first look poster along with star cast and release date details)అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటిస్తోంది. జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో అఖిల్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళుతున్న నిఖిల్ లుక్ ఆసక్తి రేపుతోంది. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అలాంటి లొకేషన్ లో సింగిల్ గా ఎందుకు నడుస్తున్నాడు.. షూ ఎందుకు వేసుకోలేదు అనేది సస్పెన్స్ గా ఉంది. మరి ఈ సినిమాతో అఖిల్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం దక్కేనా అన్నది ఆసక్తికరం. అఖిల్ కే కాదు. దర్శకుడు భాస్కర్ కూడా చాలాకాలం నుంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.