వేసవిలో ప్రేక్షకుల ముందుకు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’

0
379
వేసవిలో ప్రేక్షకుల ముందుకు 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'
వేసవిలో ప్రేక్షకుల ముందుకు 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే కథానాయిక.  బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకో షెడ్యూల్‌ చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ నెలాఖరుతో పూర్తయ్యే ఆ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

 

 

 

మొదట సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవి లక్ష్యంగా ముస్తాబవుతోంది. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ.