స్పీడ్ పెంచుతున్న అఖిల్.. జులై 12నుంచి AGENT..!

0
948
Akhil Next Agent resume shoot from July 12

Agent Akhil: అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తోంది. దీని తరువాత అఖిల్ (Akhil) స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ (Agent) అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే.

గతంలో కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. “ఏజెంట్” మూవీ షూటింగ్ త్వరలో పునః ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్ సినిమా మీద ఆశలు పెంచాయి. అఖిల్ ఈ సినిమాతో అన్న హిట్ వస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో మోహన్ లాల్ కూడా నటించబోతున్నారు అని టాక్. అయితే ఆయన ఇప్పటికే మనమంతా , జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగులో కూడా అభిమానులని పొందారు. ఇక ఈ సినిమాలో ఆయన ఏజెంట్ పై ఆఫీసర్ గా కనిపించబోతున్నారు అని టాక్.

AKHIL AKKINENI SURENDER REDDY AGENT TO SHOOT IN KRISHNAPATNAM PORT

ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ గతంలో అఖిల్ మిస్టర్ మజ్ను కోసం సంగీతం సమకూర్చారు.