Pallavi Prashanth Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 లో ఎప్పుడు ఎలాంటి టాస్క్ లు ఇస్తాడో క్లారిటీ లేదు. వారం గడిచినా కంటెస్టెంట్స్ ఇంకా హౌస్ మేట్స్ కాలేదు. పవర్ అస్త్రం గెలిచి మొదటి హౌస్‌మేట్ అయ్యాడు సందీప్ ఒక్కడే. బిగ్ బాస్ హౌస్ లో 13 మంది వున్నారు ప్రస్తుతం. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఎప్పుడు కనిపిస్తాయో తెలియదు. నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగింది. ఈ క్రమంలో శివాజీ, పల్లవి ప్రశాంత్‌లను పలువురు నామినేట్ చేశారు.
Pallavi Prashanth Bigg Boss 7: మొట్టమొదట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎక్కువ మంది టార్గెట్ గా చేసినట్టు అందరూ అనుకుంటున్నారు. అమర్‌దీప్, గౌతమ్, ప్రియాంక, తేజ, షకీలా ఇలా చాలా మంది వివిధ కారణాలతో ప్రశాంత్‌ను నామినేట్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్‌ని హౌస్‌మేట్స్ ఎలా వేధిస్తున్నారనే దానిపై బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ ఒక వీడియో తో స్పందించాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారాన్ని ప్రారంభించింది. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు, ఎలిమినేషన్లు, టాస్క్ లతో కళకళలాడింది. అయితే అదే ప్రాంతంలో సందడితో పాటు వాగ్వాదాలు, అలకలు, అరుపులు కూడా జరిగాయి. హౌస్ లో అడుగు పెట్టిన రెండవ వారం లో హౌస్‌మేట్స్ యాక్షన్ మోడ్‌లో వెళ్లారు టాస్క్ లతో.
ఇక చెప్పడానికి ఏమీ లేదు, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రైతు కొడుకు ప్రశాంత్ ని టార్గెట్ చేసిన తీరు వివాదాస్పదమైంది. దీంతో టైటిల్ పోరులో పల్లవి ప్రశాంత్ ఫేవరెట్‌గా మారదు. అంతే కాకుండా అందరూ గూగుల్ లో కూడా ప్రశాంత్ వోటింగ్ నెంబర్ కోసం వెతకటం స్టార్ట్ చేసారు..