సురేందర్ రెడ్డి- అఖిల్ కాంబో సెట్ అఫీషియల్

391
akkineni akhil 5th movie confirmed with director surender reddy

Akhil Akkineni: అక్కినేని అభిమానులకు కిక్కిచ్చే అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అంతా అనుకున్నట్లుగానే సురేందర్ రెడ్డి (Surender Reddy)- అఖిల్ (Akhil) కాంబో సెట్ అయింది. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. `సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. గత కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి- అఖిల్ కాంబోలో సినిమా రానున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ ప్రకటన చేశారు యూనిట్ సభ్యులు.

ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు అఖిల్‌. చిత్రీక‌ర‌ణ చివ‌రికి వచ్చింది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్‌లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. అఖిల్ కెరీర్‌లో 5వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు.