akkineni nagarjuna finished his wild dog movie shooting

స్టార్ హీరో, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్‌’ షూటింగ్ ఫినిష్ చేశారు.ఇందులో ‘కింగ్’ నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా హిమాలయాస్‌లోని అందమైన లొకేషన్స్‌లో చివరి షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన.. తన పాత్ర తాలూకు పార్ట్ అంతా పూర్తిచేశారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ ట్వీట్ చేసిన నాగ్, వైల్డ్‌డాగ్ యూనిట్‌తో దిగిన ఫోటోలు షేర్ చేశారు.

”వైల్డ్‌డాగ్‌ మూవీకి సంబంధించి నా పాత్ర షూటింగ్ ఈరోజుతో పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది” అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు నాగార్జున. చిత్ర యూనిట్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను నాగార్జున షేర్ చేశారు. ఈ ఫోటోలలో నాగార్జునతో పాటు బాలీవుడ్ బ్యూటీ సయామి ఖేర్ – ‘బిగ్ బాస్’ ఫేమ్ అలీ రెజా కనిపిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందనున్న ఈ సినిమాలో నాగ్ సరసన దియామీర్జా నటిస్తున్నారు. సయామీ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు.

Nagarjuna wraps up shoot of Wild Dog; shares pics with Saiyami Kher and the cast