మన్మథుడు 2 సెన్సార్ టాక్

Akkineni Nagarjuna Manmadhudu 2

మన్మథుడు 2 …ఈ సినిమాపై యూనిట్ లో అయితే మామూలు నమ్మకం లేదు.నాగార్జున తన బ్యానర్ లో రూపుదిద్దుకున్న సినిమా అవుట్ ఫుట్ విషయంలో చాలా ఖరాఖండిగా ఉంటాడు.అయితే మన్మథుడు 2 విషయంలో మాత్రం నాగార్జున చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు.అది ఆల్రెడీ హిట్ అయిన సినిమా కంటెంట్ కావడంతో నాగార్జున అంత నమ్మకంగా ఉన్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఏది ఏమైనా మన్మథుడు-2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ లో సందడి చెయ్యబోతున్నాడు అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది.రన్ టైం కూడా రెండున్నర లోపే ఉంది అని టాక్.

ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది.అంటే ట్రైలర్ లో చూపించిన మన్మథుడి చిలిపి వేషాలు సినిమాలో కూడా ఉన్నాయి అని అర్ధమవుతుంది.లిప్ లాక్స్,రకుల్ తో రొమాన్స్ లాంటి వ్యవహారాల వల్ల యూత్ లో కూడా ఆ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది.సో,ఆ సీన్స్ సినిమాలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కేవలం ‘ఏ’ సెంటర్స్ కి మాత్రామే పరిమితం కాదు అనే విషయం కన్వే అవుతుంది.ఇక వెన్నెల కిషోర్ మెరుపులు,సమంత,కీర్తి సురేష్ ల స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి అనేది సెన్సార్ టాక్.మరి ఈ రిపోర్ట్ థియేటర్స్ లో ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.