Akkineni Nagarjuna, Rakul Preet Singh, Manmadhudu 2 Teaser, Tollywood Movie News
Akkineni Nagarjuna, Rakul Preet Singh, Manmadhudu 2 Teaser, Tollywood Movie News

 

గతంలో మన్మధుడు అనే టైటిల్ పెట్టి,నాగార్జున ని వుమెన్ హేటర్ గా చూపెట్టి భారీ విజయం అందుకున్నారు రైటర్ త్రివిక్రమ్,డైరెక్టర్ విజయ భాస్కర్.ఇప్పుడు దానికి సీక్వెల్ అంటూ హి లవ్స్ ఉమెన్ అనే క్యాప్షన్ తో మన్మథుడు-2 ని తెరకెక్కించారు.

మొదటి సినిమా చి.ల.సౌ తో మంచి విజయాన్ని అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.టీజర్ ఆద్యతం కూడా చాలా ఫన్నీ గా,ఫ్రెష్ గా అనిపించింది.ఈ మధ్య సూపర్ ఫామ్ లో ఉన్న వెన్నెలకిషోర్ పేల్చిన పంచులు బాగా పేలాయి.నాగార్జున కూడా వయసు తగ్గించుకున్నట్టు చాలా యంగ్ లుక్ లో ఉన్నాడు.ఇక ఈ సినిమాలో నాగార్జున మీద చాలా పంచెస్ పేల్చారు.నాగ్ కామెడీ టైమింగ్ లో ఉన్న నాచురాలిటీ వల్ల అవి వర్క్ అవుట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో F2 తరహాలో కామెడీ హడావిడి చేసాడు.అలాగే నాగ్ లోని నాటీ నెస్ కూడా వాడుకున్నాడు రాహుల్ రవీంద్రన్.సినిమాలో ఇతర స్టార్ కాస్ట్ వల్ల సినిమా రేంజ్ చాలా పెరిగింది.ఏ ఒక్క క్యారెక్టర్ కూడా పర్పస్ లెస్ గా ఉన్నట్టు కనిపించట్లేదు.వర్జిన్ లాంటి పదాలు వాడినా అవి కామెడీ గా ఉన్నాయి గానీ ఆడ్ గా లేవు.అలాగే పోర్చుగల్ లో షూట్ చెయ్యడం వల్ల చాలా రిచ్ నెస్ వచ్చింది.

ఈ టీజర్ లో హీరోయిన్స్ ని రివీల్ చెయ్యలేదు.కానీ మన్మధుడు-2 లో కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా ఉందని మాత్రం అర్ధమయేలా కట్ చేసారు.ఈ సినిమా సాహో కి ఆరు రోజుల ముందు అంటే ఆగస్టు 9 న ప్రేక్షకులముందుకు రాబోతుంది.